వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వానికి, రెబల్ ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్, రాజీనామాలు, అనర్హత వేటు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలకు, కర్ణాటకలోని సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి ఊరట లభించింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించరాదని, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం సుప్రీం కోర్టు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల అర్జీని విచారించింది. రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ఉద్దేశపూర్వకంగా వారికి విప్ జారీ చేశారని, రాజీనామా చెయ్యని ఎమ్మెల్యేల మీద విప్ ప్రయోగించాలని రెబల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

Suprem Court orders status quo till Tuesday on Karnataka’s rebel MLAs

సీఎంకు, కర్ణాటక ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని, రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ఇబ్బంది లేదని సీఎం కుమారస్వామి తరపు న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతులేదని రెబల్ ఎమ్మెల్యేలు గురువారం అర్జీ సమర్పించారని, దానిని న్యాయస్థానం ఏకపక్షంగా విచారణకు ప్వీకరించిందని సీఎం తరపు న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు.

రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారు మంత్రులు అయ్యే అవకాశం ఉందని, అంతుకు ముందే వారిని అనర్హులను చెయ్యడానికి ఆదేశాలు జారీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది అభిషేక్ మను సంఘీ సుప్రీం కోర్టులో మనవి చేశారు.

రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని, అందువలన ఆయనకు ప్రత్యేకించి గడువు ఇవ్వరాదని స్పీకర్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు మనవి చేశారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాల విషయంలో గతంలో జరిగిన అనేక సంఘటనలను స్పీకర్ న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కొందరు ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారి మీద అనర్హత వేటు వెయ్యాలని కాంగ్రెస్ తరపు న్యాయవాది కోర్టులో మనవి చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు, సీఎం, ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

మంగళవారం వరకూ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించరాదని, వారి మీద అనర్హత వేటు వెయ్యరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. రెబల్ ఎమ్మెల్యేలు సైతం అర్హత వేటు నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నారు.

English summary
Suprem Court ordered status quo with regard to resignation and disqualification of 10 MLAs. The matter will be heard next on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X