పర్మినెంట్ జడ్జిలుగా 12 మంది అడిషనల్ జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదం...

కర్ణాటక హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా 10 మంది అడిషనల్ జడ్జిలను,కేరళ హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించే ప్రతిపాదనకు సుప్రీం కోర్టు కొలిజియమ్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం(సెప్టెంబర్ 7) సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఆ వివరాలను వెల్లడించారు.

కర్ణాటక హైకోర్టులో అడిషనల్ జడ్జి హోదా నుంచి పర్మినెంట్ జడ్జి హోదా పొందినవారిలో జస్టిస్ మరలూర్ ఇంద్రకుమార్ అరుణ్,జస్టిస్ ఇంగలగుప్పే సీతారామయ్య ఇందిరేష్,జస్టిస్ రవి వెంకప్ప హోసమణి,జస్టిస్ సవనూర్ విశ్వజిత్ శెట్టి ఉన్నారు.కర్ణాటక హైకోర్టులో అడిషనల్ జడ్జి హోదా నుంచి పర్మినెంట్ జడ్జి హోదా పొందినవారిలో ఎంఆర్ అనిత,నాయర్ హరిపాల్ ఉన్నారు.

supreme court approves 12 additional judges as permanent judges in highcourts

జస్టిస్ శివశంకర్ అమరన్నవర్, జస్టిస్ ఎం.గణేశయ్య ఉమా, జస్టిస్ వేదవ్యాసచర్ శ్రీశానంద, హంచతే సంజీవ్‌కుమార్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్,జస్టిస్ పి కృష్ణ భట్‌లను కూడా అడిషనల్ జడ్జి హోదా నుంచి శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీం ఆమోదం తెలిపింది.

గత నెలలో సుప్రీం కోర్టులో 9 మంది కొత్త న్యాయమూర్తులను నియమించిన సంగతి తెలిసిందే.సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి 9 మంది న్యాయమూర్తులు(Supreme Court Judges) ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. సీజేఐ సహా 9 మంది కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది.సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నిర్ణయం మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సుప్రీం జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయంగా అయితే సీజేఐ కోర్టు(Supreme Court) రూమ్​లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా దృష్య్టా ఈసారి ఆడిటోరియంలో నిర్వహించారు.

సుప్రీం కోర్టు కొత్త న్యాయమూర్తుల్లో జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్‌, జస్టిస్ మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ఉన్నారు.ఒకేసారి ముగ్గురు హైకోర్టు మహిళా న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించారు. వీరిలో ప్రస్తుత కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ బి.వి.నాగరత్న ఉన్నారు. జస్టిస్ నాగరత్న 2027లో దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదివరకు గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సుప్రీంకోర్టులో ఇప్పటివరకు సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న తెలుగు వ్యక్తి జస్టిస్ పి.ఎస్‌.నరసింహ కూడా భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+