వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీదీ సర్కార్‌కు సుప్రీం ఆక్షింతలు : ప్రియాంకను ఆలస్యంగా విడుదల చేయడంపై నోటీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న బెంగాల్ టీఎంసీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదని తప్పుపట్టింది. దీనిపై షోకాజు నోటీసులు కూడా జారీచేసింది. ప్రియాంక విడుదల విషయంపై సర్వోన్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది.

ఏం జరిగిందంటే ..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను బీజేపీ యువ మోర్చా నేత ప్రియాంక శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై మే 10న టీఎంసీ నేతలు ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ప్రియాంక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను మే 14వ తేదీన వెకేషనల్ బెంచ్ చేపట్టింది. ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే బెంగాల్ టీఎంసీ సర్కార్ వివిధ కారణాలు చూపుతూ ఒకరోజు ఆలస్యంగా ప్రియాంకను విడుదల చేసింది.

Recommended Video

బీజేపీ పై చిందులు తొక్కిన దీదీ
supreme court given bengal govt showcase notice

మరోసారి సుప్రీంకోర్టుకు ...
ఇంతవరకు ఓకే .. కానీ ప్రియాంకను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేయడంపై ఆమె సోదరుడు మరోసారి సుప్రీం మెట్లెక్కారు. బెంగాల్ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిల్‌ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ప్రియాంకను తక్షణమే విడుదల చేయాలని చెపితే .. ఎందుకు ఆలస్యం చేశారని మొట్టికాయలు వేసింది. ఆలస్యానికి గల కారణం తెలుపాలని స్పష్టంచేసింది. బెంగాల్ ప్రభుత్వానికి షోకాజు నోటీసు కూడా జారీచేసింది.

English summary
The Bengal govt was also spotted in the Supreme Court. Why did they fail to follow their orders. The show also issued notices. The Supreme Court erred in the Bengal government's decision on the release of Priyanka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X