దాణా స్కామ్: అర్‌జెడి నేత లాలూకు సుప్రీం బెయిల్
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు అక్టోబర్ 3వ తేదీన తీర్పు చెప్పింది. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. జార్ఖండ్ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇదే కేసులో మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. వీరిద్దరిని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. లాలూకు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.

లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్లుగా ఈ కేసు విచారణ సాగింది. దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్.
మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం 61 కేసులు నమోదు కాగా 41 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. కేసుకు సంబంధించి 56 మందిపై కేసు నమోదు కాగా విచారణ కాలంలో 7గురు మృతి చెందారు. లాలూ సహా 45 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.












Click it and Unblock the Notifications