వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం..ఫడ్నవీస్..అజిత్ పవార్ కు నోటీసులు: వెంటనే బల పరీక్ష అవసరం లేదు: సుప్రీం కోర్టు నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..గవర్నర్ తీరు పైన సుప్రీంలో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగాయి. వారి వాదనల విన్న తరువాత సుప్రీం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కేసు పైన తదుపరి విచారణ..తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సభలో సంఖ్యా బలం లేకుండా ఎలా చేస్తారని..గవర్నర్ ఆయన్ను ఎలా ఆహ్వానిస్తారంటూ మూడు పార్టీలకు చెందిన న్యాయవాదులు కోర్టు ముందు వాదించారు. ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీకి 24 గంటల సమయం ఇవ్వాలని ప్రతిపాదించారు.

తమ కూటిమికి మెజార్టీ ఉందని..వారు విఫలమైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉందని కూటమి తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఎన్నికల ముందు కుదర్చుకున్న పొత్తు ఫలితాల తరువాత విఛ్చిన్నమైందని..దీంతో..ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకున్న మూడు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నాయని కోర్టుకు వివరించారు. అయితే, బీజేపీ తరపు న్యాయవాది మాత్రం ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించాలో కోర్టు నిర్ణయించలేదని తన వాదన వినిపించారు.

కేంద్రం..ఫడ్నవీస్..అజిత్ కు సుప్రీం నోటీసులు

కేంద్రం..ఫడ్నవీస్..అజిత్ కు సుప్రీం నోటీసులు

మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం..గవర్నర్ తీరు..అజిత్ పవార్ తో ప్రమాణం చేయించటం పైన కూటమి న్యాయవాదులు సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఇది మొత్తం కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్ వ్యవహరించారని కూటమి తరపు కపిల్ సిబల్ వాదించారు. మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర సూచనలతో పని చేస్తున్నారని కపిల్ సిబల్ వాదించారు.

అర్దరాత్రి రాష్టపతి పాలన ఎత్తివేయటం ఏంటని ప్రశ్నించారు. మెజార్టీ లేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశం లేకుండా రాష్ట్రపతి పాలన ఎత్తివేయటం ఏంటని నిలదీసారు. కూటమి తరపు న న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి..ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ..అజిత్ పవార్ కు నోటీసులు జారీ చేసింది. సోమవారం తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.

వెంటనే బలపరీక్ష అవసరం లేదు

వెంటనే బలపరీక్ష అవసరం లేదు

ఫడ్నవీస్ ప్రభుత్వం 24 గంటల్లోగా తమ మెజార్టీ నిరూపించుకొనేలా ఆదేశాలివ్వాలని కూటమి న్యాయవాదులు సుప్రీంను కోరారు. అయితే, సుప్రీం వెంటనే బల నిరూపణ చేయాల్సిన అవసం లేదని వ్యాఖ్యానించింది. సోమవారం ఉదయం 10.30 గంటల కల్లా మద్దతిచ్చే వారి వివరాలతో లేఖ ఇవ్వాలని ఆదేశించింది. బల పరీక్ష అంశం పైన సోమవారం చేపట్టే తదుపరి విచారణలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

లేఖ అందిన తరువాతనే బల పరీక్ష పైన నిర్ణయం రానుంది. అసలు..మహారాష్ట్ర హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశం పైన సుప్రీం వరకు ఎందుకు రావాల్సి వచ్చిందని బీజేపీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అసలు బల పరీక్ష పైన సమయం డిసైడ్ చేయలేదని ముఖుల్ రోహిత్గీ వాదించారు. దీంతో..తాజాగా సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది.

కూటమి వాదనలతో విభేదించిన బీజేపీ

కూటమి వాదనలతో విభేదించిన బీజేపీ

సుప్రీంలో వాదనల సమయంలో కూటమి నేతలు మొత్తంగా గవర్నర్ వ్యవహరించిన తీరు..ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ 24 గంటల్లోగా బల పరీక్ష ఎదుర్కోవాలని..సంఖ్యా బలం లేకపోతే తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉందని వాదించారు. అయితే, బీజేపి న్యాయవాది మాత్రం దీంతో విభేదించారు. ఫలితాలు వచ్చిన తరువాత ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.

బల పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనేది గవర్నర్ నిర్ణయమని..దీనిని న్యాయ వ్యవస్థ నిర్ణయించలేదని స్పష్టం చేసారు. అయితే, వెంటనే బల పరీక్ష డిమాండ్ పైన సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఫడ్నవీస్ కు కొంత రిలీఫ్ గా కనిపిస్తోంది.

English summary
Supreme court issued notices to central govt and Fadnavis and Ajith pawar. court directed to submit supporting letter as required majority. case posted for Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X