ఏదో జరుగుతోంది: సుప్రీం జడ్జీల ప్రెస్‌మీట్‌పై అన్నా హజారే

Subscribe to Oneindia Telugu

అహ్మద్‌నగర్: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశం వ్యవహారంపై స్పందించారు. జడ్జీలు తమ ఆవేదనను బయటికి చెప్పుకోవడం తప్పేం కాదని అన్నారు.

ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులకు, జడ్జీలకు ఏవైనా సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే అనుమానం కలుగుతోందని ఈ సందర్భంగా అన్నా హజారే అన్నారు. ఒక వేళ ఇలా జరిగితే ప్రజాస్వామ్యానికి విఘాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రెస్ మీట్ ఎఫెక్ట్: రంజన్ గగోయ్‌ తదుపరి సీజేఐ కాలేరా?

Supreme Court judges' comments expose unholy nexus: Anna Hazare

తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధి నుంచి పీటీఐతో ఫోన్లో మాట్లాడిన అన్నా హాజరే.. న్యాయమూర్తుల ప్రెస్ మీట్ వ్యవహారంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా వారు ఆరోపణలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Social activist Anna Hazare today congratulated the four Supreme Court judges for airing their views about the way the top court was functioning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి