దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

సోమవారానికి అన్నీ సర్దుకుంటాయ.. సుప్రీం సంక్షోభంపై అటార్నీ జనరల్

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్‌ న్యాయమూర్తుల మధ్య ఏర్పడిన విబేధాలు సోమవారం నాటికి సర్దుకుంటాయని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. శనివారం ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) తీరుపై సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

  attorney-general-kk-venugopal

  ఈ విషయంలో అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ 'సోమవారం నాటికి సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దీన్ని మరింత పొడిగించాలని అనుకోవడం లేదు..' అని వ్యాఖ్యానించారు.

  భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన విషయం తెలిసిందే. సదరు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ఆదివారం భేటీ అయ్యే అవకాశం ఉంది.

  చీఫ్ జస్టిస్ పనితీరుపై వారు మాట్లాడారు. కొన్ని రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో పాలన వ్యవహారాలు సవ్యంగా జరగడం లేదని, వాటిని సరిదిద్దేలా సీజేఐని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, విధిలేని పరిస్థితుల్లోనే ప్రజల ముందుకొచ్చి వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందన్నారు.

  English summary
  Attorney General KK Venugopal hoped on Saturday that the crisis in the top judiciary following a public criticism of Chief Justice of India Dipak Misra by four Supreme Court judges will be “settled”. “Let’s hope everything works out very well,” he told reporters a day after the four judges questioned “selective” case allocation and certain judicial orders in an unprecedented press conference. Amid concerns over a rift in India’s top court, Prime Minister Narendra Modi’s principal secretary, Nripendra Misra, was seen on Saturday morning driving to the CJI’s residence. He was seen sitting inside his official car that returned from the gate.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more