సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు..! మైనింగ్ ట్యాక్స్ రాయల్టీ రాష్ట్రాలకే..
రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ పై రాయల్టీ తీసుకునే హక్కుపై సుప్రీంకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్న వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. 8:1 మెజార్టీతో ఈ తీర్పు ఇచ్చింది. దీంతో ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ప్రయోజనం కలగబోతోంది.
రాష్ట్రాల్లో ఖనిజాలు తవ్వుకుంటున్న మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేసుకునే హక్కు కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరికి ఉందన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీరర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది. రాయల్టీ అనేది పన్నుతో సమానం కాదని సుప్రీం ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. అయితే ఖనిజ హక్కులపై పన్ను విధించేందుకు రాష్ట్రాలను అనుమతిస్తే ఆదాయం పొందేందుకు రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని.. జాతీయ మార్కెట్ దోపిడీకి గురికావచ్చని అభిప్రాయపడ్డారు.

గనులు మరియు ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టంలో రాష్ట్రాలను మైనింగ్ పై పన్ను విధించకుండా అడ్డుకునే అధికారం పార్లమెంట్ కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పులో తెలిపింది. అంతకు ముందు ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని కేంద్రం వాదించింది. అయితే ఈ వివాదం రాజ్యాంగంలో ఉన్న విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీని ప్రభావితం చేస్తుందా అని గతంలో ఛీఫ్ జస్టిస్ .. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగారు. చివరికి కేంద్రం మైనింగ్ పై పన్ను విధిస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని తేల్చేసింది.












Click it and Unblock the Notifications