వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫడ్నవీస్ కు 24 గంటల సమయం: రేపు సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష : సుప్రీం ఆదేశం..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ బలపరీక్షకు సుప్రీం సమయం నిర్దేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసింది. ఆ లోగా ఎమ్మెల్యేలంతా ప్రమాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బల పరీక్ష మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో..కూటమి వాదించిన విధంగా సుప్రీం ఫడ్నవీస్ ను 24 గంటల సమయం నిర్ధేశించింది. దీంతో..మహారాష్ట్ర లో ఇప్పుడు బీజేపీ తమ ప్రభుత్వం కొనసాగటానికి అవసరమైన బలం నిరూపించుకోవటానికి సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో..ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

కూటమి కోరినట్లుగా 24 గంటల సమయం

కూటమి కోరినట్లుగా 24 గంటల సమయం

మూడు పార్టీల కూటమి వాదించిన విధంగా సుప్రీం 24గంటల్లోగా బల నిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ముందు నిజంగా బలం ఉంటే 24 గంటల సమయం ఇవ్వాలని..లేకుంటే తమకు అవకాశం ఇవ్వాలంటే కూటమి న్యాయవాదులు కోరారు. దీని పైన రెండు రోజుల పాటు విచారించిన కోర్టు బుధవారం బల పరీక్ష పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటుగా కూటమి న్యాయవాదులు కోరినట్లుగా బల పరీక్ష వ్యవహారం మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు బీజేపీ తమ బలాన్ని ఏ రకంగా నిరూపించుకుటుందనేది ఆసక్ది కరంగా మారుతోంది.

24 గంటల్లో ఎమ్మెల్యేల ప్రమాణం..బల పరీక్ష

24 గంటల్లో ఎమ్మెల్యేల ప్రమాణం..బల పరీక్ష

ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కి కావాల్సిన సంఖ్యా బలం లేదని..ఉంటే 24 గంటల్లోగా బలం నిరూపించుకోవాల్సిందా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం ను కోరారు. తమ మూడు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉందని కోర్టుకు నివేదించారు. కనీసం గవర్నర్ నుండి లేఖ కూడా లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. వారు 24 గంటల్లో మెజార్టీ నిరూపించోలేని పరిస్థితి ఉంటే..తమ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. దీంతో పాటుగా ఈ 24 గంటల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5 గంటల లోగా పూర్తి చేసి బల పరీక్ష చేపట్టాలని సుప్రీం ఆదేశించింది.

ప్రత్యక్ష ప్రసారం ద్వారా

ప్రత్యక్ష ప్రసారం ద్వారా

సభలో ముందుగా ప్రొటెం స్పీకర్ ను నియమించాల్సి ఉంటుంది. ఆ తరువాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంది. స్పీకర్ ఎన్నిక లేకపోయినా...అంత సమయం లేకపోవటంతో ప్రొటెం స్పీకర్ బల పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి నేతలు తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ పేరడ్ నిర్వహించింది. దీంతో బీజేపీ సైతం తమకు 170 మంది సభ్యుల మద్దతు ఉందని చెబుతోంది. దీంతో..ఇప్పుడు సుప్రీం తీర్పుతో అసలు ఎవరి బలం ఏంటనేది సభలో తేలనునంది. ఈ మొత్తం వ్యవహారం పైన కూటమి కోరినట్లుగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రహస్య బ్యాలెట్ ద్వారా కాకుండా ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది.

English summary
Supreme court ordered Fadnavis govt to prove majority in assembly with in 24 hours. By 5 pm on wednesday floor test will begin in house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X