వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుశాంత్‌ సింగ్ డెత్ కేస్‌లో సడన్ ట్విస్ట్: సీబీఐ రాడార్‌లోకి బాలీవుడ్ సెలెబ్రిటీస్: సుప్రీం

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశం మొత్తాన్ని నివ్వెరపరచిని బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతంలో మరో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలను జారీ చేసింది. సుశాాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతంపై రోజుల తరబడి కొనసాగుతూ వస్తోన్న వివాదానికి తెర దించేలా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య నలుగుతోన్న ఈ హైప్రొఫైల్ సూసైడ్ కేసు ఇక దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ పరిధిలోకి వెళ్లబోతోంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది.

రియా పిటీషన్ కొట్టివేత..

రియా పిటీషన్ కొట్టివేత..

ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి బిహార్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు నమోదు చేసిన ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పాట్నా, ముంబై పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదు పత్రాలను పరిశీలించింది. అనంతరం దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

రెండు రాష్ట్రాల మధ్య..

రెండు రాష్ట్రాల మధ్య..


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం మహారాష్ట్ర, బిహార్ పోలీసుల మధ్య నానుతోంది. బిహార్‌కు చెందిన సుశాంత్ సింగ్.. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న కారణంగా.. ఈ కేసు ఈ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదానికి దారి తీసింది. సుశాంత్ సింగ్ సొంత రాష్ట్రం బిహార్. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతంంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని, స్నేహితురాలు రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఇటీవలే కేకే సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కేకే సింగ్ ఫిర్యాదుతో పాట్నా పోలీసులు ఎంట్రీ..

కేకే సింగ్ ఫిర్యాదుతో పాట్నా పోలీసులు ఎంట్రీ..

తన కుమారుడి మరణంలో రియా చక్రవర్తి పాత్రపై ఆరా తీయాలని, ఆమె ప్రమేయం ఎంత మాత్రం ఉందనే విషయాన్ని నిగ్గు తేల్చాలని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రియా చక్రవర్తిపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కేసును నమోదు చేసుకున్న పాట్నా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు ఏర్పడ్డాయి. సుశాంత్ సింగ్ ముంబైలో ఆత్మహత్య చేసుకోవడంతో.. అక్కడి పోలీసులు ఈ కేసుపై విచారణ నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ సాగించిన కేసు పురోగతి, దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయాలను ఇచ్చిపుచ్చుకోవట్లేదనే ఆరోపణలు ముంబై పోలీసులపై వెల్లువెత్తాయి.

బిహార్ ప్రభుత్వం ఇదివరకే

బిహార్ ప్రభుత్వం ఇదివరకే


తమ దర్యాప్తునకు ముంబై పోలీసులు సహకరించట్లేదంటూ పాట్నా పోలీసులు హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లోనే ఈ కేసును సీబీఐకి బదలాయించేలా బిహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ ఆమె పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ధర్మాసనం.. ఈ పిటీషన్‌ను కొట్టి వేసింది. పాట్నా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఇతర వివరాలు సమగ్రంగా ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. ముంబైకి బదిలీ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

సీబీఐ రాడార్ పరిధిలోకి బాలీవుడ్ సెలెబ్రిటీస్

సీబీఐ రాడార్ పరిధిలోకి బాలీవుడ్ సెలెబ్రిటీస్

హైప్రొఫైల్ సూసైడ్ కేసు కావడం, అనేక అనుమానాలు వ్యక్తం అవుతుండటం, రెండు రాష్ట్రాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో జాప్యం చోటు చేసుకోవడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సీబీఐ రంగ ప్రవేశం చేయడం వల్ల కేసు మూలాల్లోకి వెళ్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసులో ఇప్పటిదాకా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బాలీవుడ్ సెలెబ్రిటీలను పలువురిని సీబీఐ తన రాడార్ పరిధిలోకి తీసుకొస్తుందనే వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి.

English summary
The Supreme Court has ordered CBI investigation in the Sushant Singh Rajput death case. FIR registered at Patna was correct. The state of Maharashtra refused the option to challenge the order, says Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X