వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా చేసిన పని మరే దేశం చెయ్యలేదు; రూ. 50 వేల కరోనా పరిహారంపై కేంద్రానికి సుప్రీం కితాబు; తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల పరిహారాన్ని ఇవ్వడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కరోనా వైరస్ మహమ్మారికి ప్రతిస్పందనగా భారతదేశం చేసిన పనిని మరే ఇతర దేశం చేయలేకపోయిందని అభిప్రాయపడింది. కోవిడ్ కోసం ప్రతిపాదించిన రూ. 50,000 పరిహారానికి సంబంధించిన కేసుపై ఆర్డర్‌ను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కరోనా మృతుల కుటుంబాలకు కాస్త ఊరట దక్కిందన్న సుప్రీం ధర్మాసనం
"ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహమ్మారి కారణంగా బాధపడిన వ్యక్తులకు కొంత ఊరట లభిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని బాధపడిన వ్యక్తి కన్నీళ్లను తుడిచేందుకు ఉపయోగపడుతున్న కారణంగా మాకు సంతోషంగా ఉంది" అని జస్టిస్ షా పేర్కొన్నారు. జస్టిస్ షా తో పాటుగా ఎఎస్ బోపన్న కూడా కేంద్రం కరోనా మృతుల పరిహారంపై స్పందించిన తీరును కొనియాడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో వైద్య వసతులు సరిగా లేకపోవడం, వైద్య ఆక్సిజన్ కొరత కారణంగా లక్షలాదిమంది మరణాలు సంభవించాయని, ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో కరోనావైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న కుటుంబాల విషయంలో భారతదేశం యొక్క ప్రతిస్పందన ప్రశంసనీయమని అన్నారు.

Supreme court praises Centers Corona Compensation plan; order Reserve

ఇండియా కరోనా ప్రతిస్పందన ఆదర్శప్రాయమని ప్రశంస
"భారతదేశ జనాభా పరిమాణం, వ్యాక్సిన్ ఖర్చులు, ఆర్థిక పరిస్థితి మరియు భారత్ ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు తెలుసనీ, తాము ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకున్నామని , భారతదేశం చేసిన పనిని మరే దేశం చేయలేకపోయింది" అని న్యాయమూర్తులు కొనియాడారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిఫార్సు మేరకు కేంద్రం కరోనా కారణంగా మరణించిన వారి బాధిత కుటుంబాలకు 50 వేల రూపాయల పరిహారం ఇవ్వడం వారికి ఒకింత ఉపశమనం అని అభిప్రాయపడ్డారు.

కరోనాతో మరణించిన కుటుంబానికి 50 వేల రూపాయల పరిహారం
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కోవిడ్ -19 తో మరణించిన వారి కుటుంబానికి ₹ 50,000 ఇవ్వాలని సిఫార్సు చేసింది, కేంద్రం ఇదే విషయాన్ని బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జూన్ 30 న ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సెప్టెంబర్ 11 న మార్గదర్శకాలను జారీ చేసిందని, ఆర్థిక సహాయం కోసం మార్గదర్శకాలను కూడా ఇచ్చినట్లుగా కేంద్రం పేర్కొంది.

ముప్పై రోజుల్లో నేరుగా ఖాతాకు .. కోవిడ్ పరిహారం
మహమ్మారి యొక్క మొదటి మరియు రెండవ తరంగాలలో కోవిడ్ -19 మరణాల ద్వారా ప్రభావితమైన కుటుంబాలకు ఈ సహాయం పరిమితం కాదని, మహమ్మారి యొక్క భవిష్యత్తు దశలలో కూడా కొనసాగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి రాష్ట్రాల ద్వారా పరిహారం అందించబడుతుందని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను, దరఖాస్తును సమర్పించిన 30 రోజుల్లోపు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే నగదు జమ అవుతుందని, ఆధార్ లింక్డ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాల ద్వారా పంపిణీ చేయబడుతుందని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.

కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం .. అక్టోబర్ 4 న తీర్పు
కోవిడ్ -19 బాధితుల కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్ మరియు అడ్వకేట్ సుమీర్ సోధి ప్రాతినిధ్యం వహించి వేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం పరిహారంపై స్పందించింది. 50 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం అక్టోబర్ 4 న తీర్పు ఇవ్వనుంది.

English summary
The Supreme Court has lauded the central government for awarding Rs 50,000 compensation to the families of the Corona deaths. No other country has been able to do what India has done. Order reserved for oct 4th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X