జియోకు విక్రయం: సుప్రీంకోర్టులో ఆర్‌కాంకు చుక్కెదురు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆర్‌కామ్ ఆస్తులను రిలయన్స్ జియోకు విక్రయించకుండా బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై మళ్లీ విచారణ జరిపేంత వరకు బాంబే హైకోర్టు తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేసింది. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్ ఆ భారాన్ని తగ్గించుకునేందుకు తన ఆస్తులను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయిస్తున్నట్లు గత డిసెంబరులో ప్రకటించింది. ఈ మేరకు అంబానీ సోదరులు అనిల్, ముఖేశ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.

అయితే దీనిపై ఎరిక్సన్ సంస్థ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది. తమ బకాయిలు చెల్లించకుండా ఆస్తులు విక్రయిస్తున్నారని ఆరోపించింది. దీంతో అనుమతులు లేకుండా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు అమ్మరాదని ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పుపై ఆర్‌కామ్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా సంస్థకు నిరాశే ఎదురైంది.
ఆస్తులు విక్రయించకుండా హైకోర్టు స్టే విధించింది. తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చింది. కాగా, స్టే ఎత్తి వేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిరాకరించడంతో ఆర్‌కామ్ మళ్లీ చిక్కుల్లో పడింది. కాగా, ఈ తీర్పు నేపథ్యంలో ఆర్‌కామ్ షేర్లు భారీగా నష్టపోయాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications