"టైం లేదు, మా టైం వేస్ట్ చేయొద్దు"- కాక్రోచ్ లకు సుప్రీంకోర్టు షాక్..!

నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపట్టిన నిరసనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా విద్యార్దుల మద్దతు లభిస్తోంది. తాజాగా సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ మార్చ్ కు విద్యార్ధులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు దాడులతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ స్పందించింది.

నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన నిరసనల సందర్భంగా ఢిల్లీలో నిరసనకారులపై పోలీసులు జరిపిన దాడులపై అత్యవసర విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని లాయర్ ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను పట్టుబట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. దీన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముందంటూ తిరస్కరించారు. అక్కడితో ఆగకుండా సదరు లాయర్ తో సీజేఐ సూర్య కాంత్, "మా సమయాన్ని వృథా చేయకండి, అలాగే మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి" అని తేల్చిచెప్పేశారు.

Supreme Court Refuses Urgent Hearing on Plea Over Police Action Against Student Protesters

నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలను విద్యార్థులు లేవనెత్తుతున్నారని న్యాయవాది సీజేఐ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ చాలా ధన్యవాదాలు, ఇక చాలు అంటూ వ్యాఖ్యానింంచారు. పోలీసుల దుశ్చర్యలను చూపించే వీడియోలు ఉన్నాయని న్యాయవాది చెప్పగా. మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు, వాటిని చూసే సమయం లేదు అని సీజేఐ స్పష్టం చేశారు. కాగా, ఇదే అంశంపై అత్యవసర విచారణ జరపడానికి ఢిల్లీ హైకోర్టు నిన్న నిరాకరించింది. ఈ విషయంలోకి కోర్టును లాగవద్దని తేల్చిచెప్పేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+