బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు: రేపు సుప్రీం కోర్టు తీర్పు, సీఎం, ఎమ్మెల్యేలకు టెన్షన్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అర్జీ విచారణ సుప్రీం కోర్టులో దాదాపు 3 గంటల 45 నిమిషాట పాటు జరిగింది. రెబల్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది ముకుల్ రోహటగి, సీఎం తరపున న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. మంగళవారం మద్యాహ్నం వాదనలు పూర్తి అయ్యాయి. ఈ వ్యవహారం చాల సున్నితమైనదని, ఇరు వర్గాల వాదనలు విన్నామని, బుధవారం ఉదయం 10. 30గంటలకు తమ తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.

కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరి మంత్రులు కావడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే స్పీకర్ వారి రాజీనామాల వియషయం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సీఎం తరపు న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

Supreme Court reserves order on Karnataka rebel MLAs resignation for tomorrow

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామాలు చేశారని, ఈ విషయంలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని, అందుకే ఆలస్యం అవుతోందని సీఎం తరుపు న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని, స్పీకర్ ను కలవడానికి అవకాశం ఉన్నా అందరూ ముంబై వెళ్లిపోయారని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టుకు చెప్పారు.

ఇది స్పీకర్, కోర్టుల మద్య పోరాటం కాదని, సీఎం, సీఎం కావాలని దొడ్డిదారిన ప్రయత్నిస్తున్న వ్యక్తల మద్య పోరాటం అని, దీనిని మీరు ప్రోత్సహించరాదని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టులో మనవి చేశారు. రాజీనామాలు అంగీకరించే విషయంలో స్పీకర్ మీద రాజకీయ ఒత్తిడి పెరిగిపోయిందని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ ఆరోపించారు.

న్యాయస్థానం స్పీకర్ మీద నమ్మకం పెట్టాలని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టుకు మనవి చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణను సస్పెండ్ చెయ్యాలని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

జులై 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎందుకు రాజీనామాలు అంగీకరించలేదని, అనర్హత విషయం ఎందుకు పరిశీలించలేదని మీరు ప్రశ్నించారని, ఆ మద్య కాలంలో స్పీకర్ వారీ రాజీనామాలు పరిశీలించారని సీఎం న్యాయవాది రాజీవ్ ధావన్ సుప్రీం కోర్టుకు వివరించారు. చట్టబద్దంగా రాజీనామాలు ఉంటేనే తాను వాటిని అంగీకరిస్తానని స్పీకర్ ఇప్పటికే స్పష్టం చేశారని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టులో చెప్పారు.

రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు కొందరు పరోక్షంగా సహకరిస్తున్నారని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని దొడ్డిదారిలో కుప్పకూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదని సీఎం న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని అనిపిస్తే వాటిని స్పీకర్ విచారణ చెయ్యడానికి అవకాశం ఉందని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ అన్నారు. స్పీకర్ నిర్ణయాలు చట్టపరంగా లేకుంటే కోర్టు ప్రశ్నించడానికి అవకాశం ఉందని, అయితే ముందుగానే స్పీకర్ ను ప్రశ్నించడానికి అవకాశం లేదని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టులో చెప్పారు.

ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నిస్తున్న కొందరి ప్రలోభాలకు లొంగిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, గురువారం సీఎం విశ్వాస పరిక్షకు సిద్దం అయ్యారని, ఇలాంటి సమయంలో వారి రాజీనామాలు అంగీకరించే విషయంలో స్పీకర్ ఆచితూచి వ్యవహించి నిర్ణయం తీసుకుంటారని సీఎం న్యాయవాది రాజీవ్ ధవన్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

సీఎం తరపు న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలపై ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్ రోహటగి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రంలోని శాసన సభలో స్పీకర్ కొన్ని నియమాలు పాటిస్తుంటారని గుర్తు చేశారు. అయితే రాజీనామాలు అంగీకరించే విషయం తాను పరిశీలిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పడం సరైందని కాదని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టులో వాదించారు.

కర్ణాటక ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదని, ఎమ్మెల్యేల మద్దతు లేని ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీలు లేదని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగి ఆరోపించారు. శాసన సభ సమావేశాలకు హాజరుకావాలని తమ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగి వాదించారు.

ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇప్పటికే మూడుసార్లు విప్ జారీ చేశారని, వెంటనే రాజీనామాలు అంగీకరించాలని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు దాదాపు 3.45 గంటల పాటు జరిగాయి.

ఈ అర్జీ విచారణ చాల సున్నితమైనదని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, బుధవారం ఉదయం 10. 30 గంటలకు తమ నిర్ణయం వెల్లడిస్తామని, అప్పటి వరకు తాము ఇంతకు ముందు ఆదేశాలు జారీ చేసినట్లు యథావిధిగా కొనసాగాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తూ తీర్పు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

English summary
Karnataka Political crisis: Supreme Court reserves order on Karnataka rebel MLAs resignation for tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X