ఈవీఎంల ట్యాంపరింగ్, ఈసీకి సుప్రీం నోటీసులు: సాధ్యం కాదని వివరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ మనోహర్ లాల్ శర్మ అనే లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

Supreme Court seeks EC reply on petition alleging tampering of EVMs

ఇటీవల ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాల్లో ఉపయోగించిన ఈవీఎంలను పూర్తిగా పరిశీలించాలని, అమెరికాకు చెందిన కంప్యూటర్‌ సైంటిస్టులతో విచారణ జరిపించాలని శర్మ పిటిషన్‌లో కోరారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఇప్పుడున్న పరిస్థితుల్లో సీబీఐ విచారణకు ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఈసీ స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరగలేదని, వాటిని ట్యాంపర్‌ చేయడం సాధ్యం కాదని చెప్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Friday sought a response from the EC on a plea seeking a probe into allegations of tampering of electronic voting machines (EVMs) during polls, including the recent five Assembly elections and Maharashtra civic polls.
Please Wait while comments are loading...