Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జహంగీర్ పురి కూల్చివేతలపై సుప్రీం ఆగ్రహం-స్టేటస్ కో ఉల్లంఘన తేలితే కఠిన చర్యలకు హెచ్చరిక

ఢిల్లీలోని జహంగీర్ పురిలో అక్రమ కట్టడాల పేరుతో ఇళ్లు కూల్చేసిన ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. జహంగీర్ పురిలో కూల్చివేతలు ఆపాలని నిన్న తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలు కొనసాగినట్లు తేలితే ఉత్తర ఢిల్లీ మేయర్ పై తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అక్కడ యథాతథ స్ధితి కొనసాగించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

జహంగీర్‌పురి కూల్చివేతపై జమియత్ ఉలమా-ఐ-హింద్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. జహంగీర్ పురిలో అక్రమ కట్టడాలపై బాధితులకు గతంలో నోటీసులు జారీ చేశారా అని ధర్మాసన ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంత గడువు తర్వాత కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. ఆ నోటీసుల వివరాలు సమర్పించాలని నోటీసులు పంపింది.అలాగే ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు సైతం సుప్రీంకోర్టు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.

supreme court serious on jahangirpuri demolitions, continue status quo till further order

ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ జహంగీర్ పురిలో చిన్న కట్టడాలు మాత్రమే కూల్చివేసినట్లు చెప్పడాన్ని సైతం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానికి బుల్ డోజర్లు అవసరమా అని ప్రశ్నించింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డిఎంసి) తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ పేవ్‌మెంట్‌పై ఉన్న చిన్న వస్తువులను మాత్రమే నిన్న కూల్చివేశారని సుప్రీం దృష్టికి తెచ్చారు.

దీనిపై స్పందించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చిన్న కుర్చీలు, పెట్టెలు వంటి వాటికి బుల్డోజర్ కావాలా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూపించినా అధికారులు కూల్చివేతలు ఆపలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం.. అది నిజమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

పిటిషనర్ల తరఫున హాజరైన కపిల్ సిబల్, అదనపు చట్టపరమైన శిక్షా చర్యలు వాడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఒక ప్రత్యేక వర్గం బుల్‌డోజింగ్‌కు గురవుతోందన్నారు. ఆక్రమణలు ఏ వర్గానికో పరిమితం కాకుండా అడ్డదారిలో జరుగుతున్నాయన్నారు. ఇది రాజకీయాలకు వేదిక కాదన్నారు. చట్టబద్ధమైన పాలన సాగుతుందని ప్రపంచానికి చెప్పడానికి ఈ కోర్టు మాకు అవసరంమని కపిల్ సిబల్ వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+