"బుల్ డోజర్ న్యాయం"పై సుప్రీం తీవ్ర ఆగ్రహం-రేవంత్ హైడ్రా యాక్షన్ వేళ..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమకు నచ్చని వారిని ఏదో కేసులో నిందితులుగా మార్చి వారి ఇళ్లను బుల్ డోజర్ల సాయంతో కూల్చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నాడనో, లేక దోషిగా నిర్ధారణ అయ్యాడన్న కారణంతో ఓ వ్యక్తి ఇంటిని ఎలా కూల్చేస్తారని సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాలను ప్రశ్నించింది. పలు రాష్ట్రాల్లో బుల్ డోజర్ న్యాయంతో బాధితులుగా మారిన వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దీనిపై సీరియస్ అయింది.

రాష్ట్రాల్లో ప్రభుత్వాల బుల్ డోజర్ న్యాయంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుోల జస్టిస్ బిఆర్ గవాయ, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఈ విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నిందితుడు క్రిమినల్ నేరంలో ఉన్నాడనే కారణంతో అతని స్థిరాస్తిని కూల్చివేయలేమని క్లారిటీ ఇచ్చారు. ఓ నిర్మాణం చట్టవిరుద్ధమైతే మాత్రమే అలాంటి కూల్చివేత జరుగుతుందని తెలిపారు. కానీ కూల్చివేతల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

supreme court serious remarks on bulldozer justice against accused or even convict

తాజాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాలు చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్లలో ఇళ్లు కూలిన ఇద్దరు వ్యక్తుల కేసులో ఏపీసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో రషీద్ ఖాన్ ఇంటిని అక్కడి బీజేపీ ప్రభుత్వం కూల్చేసింది. రషీద్ ఖాన్ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణపై బీజేపీ సర్కార్ ఈ చర్య తీసుకుంది. అలాగే
మధ్యప్రదేశ్‌లోని జావ్రాలో ముహమ్మద్ హుస్సేన్ తండ్రి ఇంటిలో కొంత భాగాన్ని అతని కుమారుడిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా కూల్చివేశారు. ఈ రెండు కేసుల్లోనూ అధికారులు చట్టపరమైన ప్రక్రియ పాటించలేదని పిటిషన్లు దాఖలయ్యాయి.

2022లో జహంగీర్‌పురి బుల్డోజర్ చర్య విషయంలో జమియత్ ఉలేమా-ఎ-హింద్, బృందా కారత్ ఇప్పటికే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో కలిపి సుప్రీంకోర్టు వీటిని విచారించింది. ఈ పిటిషన్లపై విచారణలో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితుడిగా ఉన్నంతమాత్రాన లేక దోషిగా నిర్ధారణ అయ్యాడన్న కారణంతో ఒకరి ఇల్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణలో దేశవ్యాప్తంగా ఇటువంటి బుల్‌డోజింగ్ కార్యకలాపాలను ఆపడానికి మార్గదర్శకాలను రూపొందించడం గురించి ఆలోచిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+