రాజకీయ ప్రత్యర్దులపై ఈడీని వాడతారా ? సుప్రీం చీవాట్లు..! తెలుగు రాష్ట్రాల్లో కేసుల వేళ..!

దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీని విచ్చలవిడిగా ప్రయోగిస్తుందన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ ఈడీ నమోదు చేసిన కేసుల వెనుక ఉన్న రాజకీయంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలకు ఈడీని వాడుకోవడంపై దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలపై సుప్రీం మండిపడింది.

లాయర్లు ఈడీ కేసుల్లో ఉన్న తమ క్లయింట్లకు సలహా ఇచ్చారనే కారణంతో వారికి సమన్లు జారీ చేయడంపై ఇవాళ సుప్రీం ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులను ప్రధాన న్యాయమూర్తి తప్పుబట్టారు. ఇది ఇలా కొనసాగకూడదని, కొన్ని మార్గదర్శకాలు అవసరమని తెలిపారు. ఈడీ అన్ని హద్దులూ దాటేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ఈడీ చురుగ్గా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

supreme court slams centre over using ED for political battles summons to lawyers

దీంతో పాటు మరో రెండు కేసుల్లోనూ ఈడీ తీరుపై అభ్యంతరం తెలిపిన సీజేఐ.. అదనపు అడ్వకేట్ జనరల్ ఎస్వీ రాజు నోరు తెరవవద్దని సూచించారు. లేకుంటే తాము దీనిపై తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా కొందరు సీనియర్ లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై బార్ అసోసియేషన్లు చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీం ఈ చర్య తీసుకుంది.

supreme court slams centre over using ED for political battles summons to lawyers

సీజే వ్యాఖ్యలకు స్పందిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఒక సంస్థ గురించి కథను రూపొందించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దయచేసి ఇంటర్వ్యూలు, వార్తలను పట్టించుకోవద్దని కోరారు.
తమ క్లయింట్ కు న్యాయసలహా ఇచ్చినందుకు లాయర్ కు ఈడీ నోటీసు జారీ చేయలేదని మాత్రం అంగీకరించారు. మరో కేసులో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ కుంభకోణానికి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను కూడా సీజే తిరస్కరించారు. ఏఏజీ ఎస్వీ రాజు నోరు విప్పితే ఈడీపై కఠిన వ్యాఖ్యలు చేస్తామని హెచ్చరించింది. రాజకీయ పోరాటాలకు ఈడీని వాడుకుంటారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+