Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు- ముగిసిన విచారణ: తీర్పు..!!

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి- పెద్ద నోట్ల రద్దు. 1,000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన సంచలనాన్ని సృష్టించింది. అప్పటివరకు చలామణిలో ఉన్న ఆయా నోట్లన్నీ ఆ క్షణం నుంచి చిత్తు కాగితాల్లా మారాయి. వాటిని మార్పిడి చేసి, కొత్త నోట్లను తీసుకోవడానికి దేశ ప్రజలందరూ బ్యాంకుల ముందు బారులు తీరి నిల్చున్నారు అప్పట్లో.

ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవ్వాళ తన విచారణను ముగించింది. ఇప్పటివరకు దాఖలైన మధ్యవర్తిత్వపు దరఖాస్తులు, ఇతర పిటీషన్లన్నింటినీ విచారణకు స్వీకరించిన ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిర్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయాన్ని వెల్లడించింది.

 Supreme Court today reserves its judgement on demonetisation

పెద్ద నోట్ల రద్దు సవాల్ చేస్తూ 58 పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంక్‌కు ఈ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. నవంబర్ 9వ తేదీ నుంచి తరచూ దీనిపై విచారణను చేపడుతూ వచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, రిజర్వ్ బ్యాంక్ తరఫున సీనియర్ అడ్వొకేట్ జైదీప్ గుప్తా, పిటీషన్ల తరఫున పీ చిదంబరం, శ్యామ్ దివాన్, ప్రశాంత్ భూషణ్ తమ వాదనలు వినిపించారు.

నోట్ల రద్దుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాల్సిందిగా ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌ను ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ నాటికి అవి సమర్పించాలని సూచించింది. దీనికి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అంగీకరించారు. ఆ డాక్యుమెంట్లను సీల్డ్ కవర్‌లో అందజేస్తామని చెప్పారు.

రద్దు నిర్ణయం తీసుకుని ఆరు సంత్సరాలు గడిచిపోయినందున, దీనిపై ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై ఆలోచించాల్సి ఉందని బెంచ్ అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోలేనప్పటికీ.. భవిష్యత్‌లో ఇలాంటి దురదృష్టకర నిర్ణయాలను పాలకులు తీసుకోనివ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని పీ చిదంబరం, ప్రశాంత్ భూషణ్.. న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+