Arvind kejriwal: మరికొద్ది గంటల్లో తేలిపోనున్న కేజ్రీవాల్ భవితవ్యం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో అరెస్టయ్యి ఈడి విచారణను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చే తీర్పు పైన దేశవ్యాప్త ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్టు చేయడానన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్.
నేడు కేజ్రీవాల్ పిటీషన్ పై తీర్పు
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మసనం మే నెలలో 17వతేదీన తీర్పును రిజర్వ్ చేసింది. మే 17న రిజర్వ్ చేసిన తీర్పును నేడు సుప్రీం ధర్మాసనం వెలువరించనుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండింగ్ కేసులో అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన ఏప్రిల్ 15వతేదీన సుప్రీంకోర్టు ఈడిని దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.

కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21వ తేదీన ఈడి అరెస్టు చేసింది. ఈ కేసులో తన అరెస్టును సమర్థిస్తూ ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది.
ఈడీ చర్యను సమర్ధించిన కోర్టు
అతని అరెస్ట్ లో ఎటువంటి చట్ట విరుద్ధమైన చర్యలేదని, ఈడి అధికారులు ఇచ్చిన సమన్లకు స్పందించకపోవడం, విచారణకు హాజరు కాకపోవడం, దర్యాప్తుకు నిరాకరించడంతోనే ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిందని పేర్కొంది. అందులో ఎటువంటి తప్పు లేదని హైకోర్టు సమర్ధించింది.
ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్
ఆపై లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు 21 రోజుల మద్యంతర బెయిల్ మంజూరు చేసి ఎన్నికల చివరి దశ ముగిసిన ఒక రోజు తర్వాత జూన్ రెండవ తేదీన తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత మళ్లీ జూన్ 20వ తేదీన ఢిల్లీలోని ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది.
ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ పై స్టే
వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు ను సవాల్ చేసింది ఈడీ. ఈడి దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేసే వరకు ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ పై హైకోర్టు జూన్ 21వ తేదీన మద్యంతర స్టే విధించింది. జూన్ 25న హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిబీఐ కూడా అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నేడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పైన తీర్పు వెలువడనుంది.












Click it and Unblock the Notifications