Electoral Bonds: సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల రద్దుతో నష్టపోయే పార్టీలివే..?

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ..సుప్రీంకోర్టు ఇవాళ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాల సేకరణపై సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పేసింది. అంతే కాదు వెంటనే రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల జారీని నిలిపేయాలని, ఇప్పటికే జారీ చేసిన బాండ్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని సైతం తీసుకున్న వారికి ఇచ్చేయాలని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు వరంగా మారిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రక తీర్పు ఇప్పుడు ఎన్నికల వేళ దేశంలో సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు తీర్పు, అందులో ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు జాతీయ స్ధాయిలో పలు రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకులేకుండా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఎన్నికల బాండ్ల జారీతో వేల కోట్ల రూపాయలు సేకరించిన బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు చుక్కలు కనిపించనున్నాయి.

supreme courts electoral bonds cancellation verdict to effect these political parties

ఎన్నికల బాండ్ల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తున్న పార్టీలపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం కచ్చితంగా పడబోతోంది. ఇందులో ముందు వరుసలో అధికార బీజేపీ ఉంది. ఇవాళ సుప్రీం కోర్టు తీర్పులోని వివరాల ప్రకారం 2017-18 నుంచి 2022-23 మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ దాదాపు రూ.6,565 కోట్లు ఆర్జించింది. ఇందులో 2022-23లో పార్టీ సంపాదించిన రూ. 2,360 కోట్లలో, ఎన్నికల బాండ్ల ద్వారా రూ.1,294 కోట్లు పొందింది.

ఆ తర్వాత స్ధానంలో కేంద్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2017-18 నుంచి 2022-23 మధ్య కాలంలో ఎన్నికల బాండ్ల జారీ ద్వారా రూ.1122 కోట్లు తెచ్చుకుంది. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ.. 2022-23లో రూ.171 కోట్లు ఇలా అందుకుంది. అయితే కాంగ్రెస్ కు వస్తున్న ఆదాయంలో ఎన్నిక బాండ్ల ద్వారా వస్తోంది 10 శాతం మాత్రమే. మరోవైపు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా ఎన్నిక బాండ్ల ద్వారా గతంలో భారీగానే నిధులు సేకరించాయి. పశ్చిమ బెంగాల్‌లో 2011 నుంచి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల బాండ్ల ద్వారా 2017-18 నుంచి 2022-23 వరకు రూ.1093 కోట్లు సేకరించింది. కమ్యూనిస్టులు మినహా మిగిలిన పార్టీలు కూడా తమ శక్తి మేరకు వీటి ద్వారా ఇప్పటివరకూ నిధులు ఇలా సేకరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+