షాక్: పంది పిల్లలను కాల్చేసి నా పిల్లలంటూ చెప్పాడు ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

సూరత్: పెళ్ళైనా పిల్లలు లేరు.అయితే తనకు నలుగురు పిల్లలున్నారని, అగ్ని ప్రమాదంలో చనిపోయారని ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేశాడు ఓ వ్యక్తి. పంది పిల్లలను చనిపోయిన తన పిల్లలుగా చూపి రూ. 20 లక్షలు భీమా సొమ్మును కాజేశాడు. అయితే ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన కూరగాయల వ్యాపారి రమేష్ పటేల్ కుట్రతో తప్పుడు డెత్ సర్టిఫికెట్లను సృష్టించి తన నలుగురు కూతుళ్ళు అగ్ని ప్రమాదంలో మరణించారని ఎల్ ఐ సి సొమ్మును క్లైయిమ్ చేశాడు.

Surat: Man burns 4 pigs, says daughters died in fire, claims insurance

సూరత్ కు సమీపంలోని మూలంద్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కూతుళ్ళు సజీవ దహనమయ్యారని రమేష్ పటేల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారి పేరున చేసిన భీమా సొమ్ము రూ. 20 లక్షలను క్లైయిమ్ చేశాడు.

అయితే అతను తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు, తప్పుడు ఆధారాలతో ఎల్ ఐ సి పాలసీ తీసుకొన్నాడు. ఒక్కొక్కరి పేరున ఐదు లక్షల రూపాయాల చొప్పున పాలసీలను తీసుకొన్నాడు.
అయితే ఈ సర్టిఫికెట్ల ఆదారంగా ఒక్కొక్క కుమార్తె వయస్సు 8 నుండి 12 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది.

అయితే ఈ ఏడాది మార్చి 13వ, తేదిన పటేల్ గ్యాస్ సిలిండర్ లీక్ చేసి తన ఇంటిని తగులబెట్టాడు. ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసేందుకుగాను ఆయన ఈ పనిచేశాడు.

అయితే ఈ ప్రమాదంలో తన నలుగురు కుమార్తైలు చనిపోయిన విషయాన్ని ఆధారాలను చూపేందుకుగాను నాలుగు పందులను సజీవంగా దహనం చేశాడు. ఇంటిని తగులబెట్టే ముందే ఇంట్లో నాలుగు పందులను ఆ ఇంట్లో వేశాడు.

అయితే ఈ ప్రమాదంలో నాలుగు పందలు సజీవ దహనమయ్యాయి. వీటి ఆధారంగా తప్పుడు డెత్ సర్టిఫికెట్లను సృష్టించి ఆయన ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేశాడు. అయితే వివాహమైన ఇంతవరకు రమేష్ పటేల్ కు పిల్లలు లేరు. ఎట్టకేలకు ఈ విషయం బయటకు వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police on Thursday arrested a man who allegedly purchased insurance policies in the name of four daughters who did not exist, and produced bogus death certificates to claim the money after staging their ‘deaths’.
Please Wait while comments are loading...