వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: ఛార్జీలు పెంచలేదు, ప్రయాణీకులకు బీమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:రైల్వే బడ్జెట్‌ సామాన్యుడి ఆశలకు అనుగుణంగా తయారు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు చెప్పారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు పార్లమెంటులో ఆయన రైల్వే బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. గంటంపావు సేపు ఆయన ప్రసంగించారు.

తెలంగాణ, ఏపీలకు పెద్దగా ఏదీ దక్కలేదు. విజయవాడ - ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా మార్గం, నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్, ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణకు కొత్త పథకం. ఈ పథకంలో మొదటి దశలోనే తిరుపతికి చోటు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు వంటివి బడ్జెట్‌లో కనిపించాయి.

- తెలంగాణ, ఏపీలకు పెద్దగా ఏదీ దక్కలేదు. ఇవీ వచ్చాయి..

- విజయవాడ - ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా మార్గం
- నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్
- ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణకు కొత్త పథకం. ఈ పథకంలో మొదటి దశలోనే తిరుపతికి చోటు.
- తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు వంటివి బడ్జెట్‌లో కనిపించాయి.
- రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.
- కోటిపల్లి - నర్సాపురం లైనుకు రూ.200 కోట్ల నిధులు.
- పిఠాపురం - కాకినాడ లైనుకు రూ.50 కోట్లు కేటాయింపు.
- కాజీపేట - విజయవాడ మూడో లైనుకు రూ.114 కోట్లు.
- పెద్దపల్లి - నిజామాబాద్ లైన్‌కు రూ.70 కోట్లు.
- మాచర్ల - నల్గొండ లైన్‌కు రూ.20 కోట్లు.
- మునిరాబాద్ - మహబూబ్ నగర్ లైన్‌కు రూ.180 కోట్లు.
- కాజీపేట - వరంగల్ మధ్య ఆర్వోబి నిర్మాణానికి రూ.5 కోట్లు.
- సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు రూ.80 కోట్లు.
- పెద్దపల్లి - జగిత్యాల మధ్య సబ్ వే నిర్మాణానికి రూ.5 కోట్లు
- రాఘవాపురం - మందమర్రి లైన్‌కు రూ.15 కోట్లు
- నంద్యాల - ఎర్రగుంట్లకు రూ.50 కోట్లు
- ఓబులవారిపల్లి - కృష్ణపట్నంకు రూ.100 కోట్లు
- కడప - బెంగళూరు లైన్ అభివృద్ధికి రూ.29 కోట్లు
- నడికుడి - శ్రీకాళహస్తికి రూ.180 కోట్లు
- కుంభం - పొద్దుటూరుకు రూ.10 లక్షలు
- విజయవాడ - హైదరాబాద్ మధ్య డబుల్ డెక్కర్ రైలు
- విశాఖ - విజయవాడ మధ్య డబుల్ డెక్కర్
- ముతోడ్ - అదిలాబాద్‌కు రూ.1 కోటి.
- మనోహరాబాద్ - కొత్తపల్లికి రూ.20 కోట్లు
- గద్వాల్ - రాయచూర్ రూ.5 కోట్లు
- అక్కన్నపేట - మెదక్ రూ.5 కోట్లు
- నాగరాఘవపూర్ - మందమర్రి రూ.15 కోట్లు
- భద్రాచలం - కొవ్వూరు రూ.5 కోట్లు
- భద్రాచలం సత్తుపల్లి రూ.కోటి
- కొండపల్లి - కొత్తగూడెం రూ.10 కోట్లు
- డిచ్ పల్లి - నిజామాబాద్ ఓవర్ బ్రిడ్జికి రూ.10 కోట్లు
- బోధన్ నుంచి బీదర్ కొత్త లైను
- కొత్త మణుగూరు - రామగుండం కొత్త లైను

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి చేపట్టే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. వీటిల్లో 17 ప్రాజెక్టును ఆమెదించగా. మరో 6 ప్రాజెక్టులకు ఎంఓయూ కదుర్చుకుంది. మొత్తం 44 భాగస్వామ్య పనుల్లో రూ.92,714కోట్ల విలువైన పనులు చేపట్టి.. 5300 కిలోమీటర్లను అభివృద్ధి చేస్తారు.
- ఈశాన్య భారత దేశాన్ని మిగిలిన ప్రాంతాలతో కలపడం ప్రభుత్వ అత్యధిక ప్రాధాన్య అంశం.
- అసోంలోని లుమ్‌డిండ్‌-సిల్‌చార్‌ సెక్షన్‌ను ప్రారంభించి బరాక్‌ ప్రాంతాన్ని దేశంతో కలుపుతాం.
- రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు
- ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్‌ బెర్తులు
- 2017-18 నాటిని రోజుకు 13 కి.మీ. బ్రాడ్‌గేజీలను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిని 2018-19నాటికి 19 కి.మీ.కు పెంచాలి. దీనికి కోసం 2017-18లో 9కోట్ల పనిదినాలు, 2018-19లో 14కోట్ల పని దినాలను సృష్టిస్తామన్నారు.
- ఆన్ డిమాండ్‌పై రైల్వే రిజర్వేషన్లు అందించడం.
- రవాణా రైల్వే టైంటేబుల్‌ను కచ్చితంగా అమలయ్యే విధంగా చేయడం.
- అత్యున్నత సాంకేతికతతో భద్రతను మెరుగుపర్చడం.
- సమయపాలనను కచ్చితంగా అమలు చేయడం.
- రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచడం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లవి 80 కిలోమీటర్లకు పెంచడం.
- స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడపడం. మానవ వ్యర్థాలను నేరుగా బయటకు పంపడాన్ని అరికట్టడం.

Suresh Prabhu reaches Parliament to present budget

- అన్ మ్యాన్డ్ రైల్వే క్రాసింగులు తీసేయాలి.

- వికలాంగుల కోసం ప్రత్యేక మరుగుదోడ్లు.
- రాజధాని, శతాబ్ది, అన్ని మెయిల్ సర్వీసుల్లో వినోదం కోసం ఎఫ్ఎం సేవలు.
- దూర ప్రాంతాల్లో అన్ని రద్దీ మార్గాలకు రిజర్వ్‌డ్ అంత్యోదయ బోగీలు.
- అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఉన్న వ్యాగన్లు. టిక్కెట్ రద్దుకు 139 హెల్ప్ లైన్లు.
- తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు
- ఈశాన్య రాష్ట్రాలకు బ్రాడ్ గేజ్ లైన్లు.
- చెన్నైలో మొదటి రైల్వే ఆటో హబ్. రైల్వే స్టేషన్లలో ఎఫ్ఎం సౌకర్యం.
- ఎస్సెమ్మెస్ చేస్తే టాయిలెట్ శుభ్రం.
- రైల్వే కూలీలకు కొత్త యూనిఫాం.
- పిల్లల కోసం రైళ్లలో వేడి నీళ్లు, పాలు, ఆహారం.
- రద్దీ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మెట్రో ప్రాజెక్టులు.
- కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వంతో భాగస్వామ్యం. విదేశీ పర్యాటకుల కోసం ఈ టికెటింగ్ విధానం.
- ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణలో తిరుపతికి చోటు. ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్. మొదటి దశలోనే తిరుపతికి అవకాశం. అధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి సుందరీకరణకు కొత్త పథకం.
- నిమిషానికి 2 వేల నుంచి 7200 టిక్కెట్లు విక్రయించేలా సామర్థ్యం పెంచడం
- 408 స్టేషన్లలో ఈ క్యాటరింగ్. ఈ ఏడాది రైల్వే పెట్టుబడులు రెట్టింపు చేస్తాం.

- హమ్ సఫర్ పేరుతో థర్డ్ ఏసీ సర్వీస్

- బుకింగ్ సమయంలోనే ప్రయాణీ బీమా అందించేందుకు బీమా సంస్థలతో ఒప్పందం.
- ఐఆర్‌సీటీసీ ద్వారా ఆహార పదార్థాల సరఫరాకు ఏర్పాట్లు. పాలు, అత్యవసర మందులు కూడా అందిస్తాం.
- ఈశాన్య రాష్ట్రాలకు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ వేస్తాం.
- పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా వడోదర నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైల్వే.
- జర్నలిస్టులకు ఆన్ లైన్ లోనే రాయితీ టిక్కెట్. 2020 నాటికి గూడ్స్ రైళ్లకు కూడా టైమ్ టేబుల్.

Suresh Prabhu reaches Parliament to present budget

- జనరల్ బోగీల్లో సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు.

- ప్రతి వినియోగదారుడు మాకు బ్రాండ్ అంబాసిడరే. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్లాట్ ఫాం టిక్కెట్ కొనుగోలుకుఅవకాశం.

- 1780 ఆటోమేటిక్ టిక్కెట్ కేంద్రాలు.
- విద్యుత్ సేకరణలో పోటీ బిడ్డింగుతో గణనీయంగా డబ్బులు ఆదా చేస్తున్నాం.
- 311 స్టేషన్లలో పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
- ఒక ప్రాజెక్టు ప్రారంభానికి రెండేళ్ల నుంచి 8 నెలల కాలానికి తగ్గించాం
- పిపిపి విధానంలో 400 స్టేషన్ల ఆధునికీకరణ
- 2015-16లో ఇంధన ఆదాతో 8,760 కోట్లు మిగులు.
- సాధారణ ప్రయాణీకులకు, రైల్వేకు ఎలాంటి అడ్డుగోడలు లేకుండా చూస్తాం.
- రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు.
- అంతర్గత ఆడిట్ విభాగాన్ని బలోపేతం చేసి లీకేజీలు అరికట్టేందుకు కృషి
- 2016-17 ఆదాయ లక్ష్యం రూ.1.84 లక్షల కోట్లు. బడ్జెట్ ద్వారా రైల్వేలకు రూ.10వేల కోట్లు
- వచ్చే ఏడాది 2800 కిలో మీటర్ల రైల్వే లైనల నిర్మాణం. మహిళల భద్రతకు 24X7 కాల్ సెంటర్.

- రైలు ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక విధానం. గత ఏడాదితో పోల్చితే 20 శాతం ప్రమాదాలు తగ్గాయి.

- వచ్చే ఐదేళ్లలో రైల్వేల ఆధునికీకరణకు రూ.8.5 లక్షల కోట్లు. పారదర్శకత పెంచేందుకు సామాజిక మాధ్యమం వినియోగం.
- తక్కువ శబ్దం, ఎక్కువ సౌకర్యం ఉండేలా చర్యలు పిపిపి విధానంలో కొత్త ప్రాజెక్టులు. ఇకపై ఆన్ లైన్లో రైల్వే టెండర్లు.
- సీసీ కెమెరా నిఘా పరిధిలోకి అన్ని స్టేషన్లు. దశల వారీగా సీసీ కెమెరాలు. రూ.1300 కోట్లతో విద్యుత్ కోనుగోలు ఒప్పందాలు.
- రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాం. ఈ టెండరింగ్ ద్వారా పనులు చేపడుతున్నాం.
- సౌకర్యాలు పెంచేందుకు ఎంపీ ఫండ్స్ ఇచ్చేందుకు 121 మంది ఎంపీలు అంగీకరించారు.
- వచ్చే ఏడాది మరో 400 స్టేషన్లలో వైఫై సౌకర్యం. రైల్వేలో ఐటీ వినియోగానికి అధిక ప్రాధాన్యం.
- ఈ ఏడాది 820 రైల్ ఓవర్ ప్రాజెక్టులు.
- సీనియర్ సిటిజన్స్ కు కోటాలో 50 శాతం పెంపు. సీనియర్ సిటిజన్లకు, మహిళలకు యాభై శాతం బెర్తులు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తులో ప్రాధాన్యం.
- దిబ్రూఘర్ ఎక్స్ ప్రెస్ రైలులో తొలిసారి బయోటాయిలెట్లు.
- ఈ ఏడాది వందకు పైగా రైళ్లలో ఆన్ బౌర్డ్ హౌస్ కీపింగ్ సేవలు, మహిళల భద్రత, సౌకర్యాలు పెంచుతాం.
- ప్రయాణీకుల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఐవీఆర్ఎస్ నెంబర్. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ షీట్లు.
- పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేస్తాం. పిపిపి విధానంలో కొత్త ప్రాజెక్టులు.
- టిక్కెట్ల బుకింగ్ కోసం అందుబాటులోకి మొబైల్ యాప్
- నాగపూర్ - విజయవాడ ట్రేడ్ కారిడార్
- సోషల్ మీడియాలో వచ్చే ఫీడ్ బ్యాకుతో సౌకర్యాలు.
- మార్చి 31లోగా మరిన్ని బయో టాయిలెట్లు
- 44వేల కొత్త ప్రాజెక్టులు, 65వేల అదనపు బెర్తులు.
- సగటు వేగం 50 కి.మీ. నుంచి 80 కి.మీ.కు పెంపు. జమ్ముకాశ్మీర్ టన్నెల్స్ నిర్మాణంలో వేగం
- 5300 కి.మీ. 44 కోత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయులు.
- అన్ని విభాగాల్లో కాగిత రహిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ దిశగా చర్యలు
- ఆరేళ్లలో సగటున రోజుకు 4.3 కిలోమీటర్ల మేర బ్రాడ్ గేజ్ నిర్మించాం.

Suresh Prabhu reaches Parliament to present budget

- మేకిన్ ఇండియాలో భాగంగా రెండు కొత్త లోకో ఫ్యాక్టరీలు.
- మిజోరాం - మణిపూర్ రైల్వే లైనున బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం.
- 7,517 కిలో మీటర్లమేర సముద్ర తీర ప్రాంతంలో కనెక్టివిటీ విస్తరణ.
- ఢిల్లీ - చెన్నై, ఖరగ్‌పూర్ - విజయవాడ, ఖరగ్‌పూర్ - ముంబై సరుకు రవాణా మార్గాలు.
- 2017 - 18లో 9వేల ఉద్యోగాల కల్పన.
- వచ్చే ఏడాది 2వేల కిలో మీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరిస్తాం.
- ఛార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి. సమయపాలన, వసతులకు ప్రాధాన్యం.
- రోజుకు 7 కి.మీ రైల్వే లైన్ల నిర్మాణం. రూ.1 ఖర్చుతో రూ.5 వృద్ధి సాధించేలా చర్యలు.
- వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు పెట్టేందుకు ఎల్ఐసీ అంగీకరించింది.
- అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేను మెరుగుపర్చుతున్నాం. రైల్వేల తీరును మెరుగుపరుస్తున్నాం. కొత్త ఆలోచనలతో ఆదాయ మార్గాలు.
- గత ఏడాది ప్రకటించిన 139 అంశాల్లో కార్యాచరణ ప్రకటించాం.
- సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విషయాల్లో రైల్వే ముందంజ వేయాల్సి ఉంది.
- రూ.1లక్ష 21వేల రూపాయలతో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం.
- భద్రతా ప్రమాణాల పెంపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నాం.
- భారతీయులంతా గర్వపడేలా రైల్వే వ్యవస్థను అందించే బాధ్యత మన పైన ఉంది.
- 2008-2014 వరకు ఎనిమిది శాతంగా రైల్వే అభివృద్ధి ఉంది. గత రెండేళ్లుగా రెండు రెట్ల వృద్ధి అందుకుంటున్నాం.
- చార్జీలు పెంచితేనే ఆదాయం అని కాకుండా ప్రత్యామ్నాయాల పైన దృష్టి సారించాం.

- డీజిల్, ఎలక్ట్రికల్ పద్ధతుల్లో భారీగా ఆదా చేయాలని నిర్ణయం
- ఇంధన సేకరణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలిగాం.
- రాబడి పెంపు కోసం సంప్రదాయ పద్ధతులు వదిలి కొత్త ఆలోచనలు చేస్తున్నాం.
- ఇది సవాళ్లతో కూడుకున్న సమయం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
- 2016 బడ్జెట్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు వస్తుంది.
- రైల్వేలో కొత్త ఆలోచనలు, కొత్త ఆదాయ మార్గాల ప్రాతిపదికన రూపొందించాం. దేశానికి రైల్వే బడ్జెట్ వెన్నెముక ఉండేలా బడ్జెట్ రూపొందించాం.

- ఓ సమయంలో సురేష్ ప్రభు వాజపేయి రాసిన కవితను చదివి వినిపించారు.
- కోట్లమంది భారతీయుల ఆశలు, అంచనాలకు అనుగుణమైన బడ్జెట్ ఇది.
- ఇది నా బడ్జెట్ కాదు. ఇది రైల్వే కుటుంబం. భారతీయులందరి ఆకాంక్ష.
- సురేష్ ప్రభు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.
- ప్రజల అంచనాల్ని, కోరికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ని తయారు చేశామని సురేష్ ప్రభు చెప్పారు. ఇది

పూర్తిగా ప్రజల బడ్జెట్‌ అన్నారు. కలిసికట్టుగా కృషి చేసి రైల్వేల్ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతామన్నారు.

- ఆన్‌లైన్‌లో విశ్రాంత గదులను గంటల లెక్కన బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
- మొబైల్‌ యాప్స్‌.. గో ఇండియా స్మార్ట్‌కార్డుల ద్వారా యూటీఎస్‌, పీఆర్‌ఎస్‌ టిక్కెట్ల కొనుగోలు
- ఒకేసారి 40వేల మంది మాత్రమే వినియోగించుకునే సామర్థ్యం ఉన్న టికెట్ల జారీని 1.20లక్షల మంది వినియోగించునే సౌలభ్యం
- ఆన్‌లైన్‌లో వీల్‌ఛైర్ల బుకింగ్‌ సౌకర్యం రైళ్లలో 17వేలు, 475 రైల్వే స్టేషన్లలో బయోటాయిలెట్ల ఏర్పాటు
- మారుమూల రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్ల వినియోగం. రానున్న రెండేళ్లలో డ్రోన్లతో రవాణా కారిడార్ల పర్యవేక్షణ.
- వచ్చే ఐదేళ్లలో వెయ్యి మెగావాట్ల సౌరశక్తిని అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యం
- విద్యుత్తు వినియోగం తగ్గించేలా అన్ని రైల్వే స్టేషన్లలో ఆధునిక ఎల్‌ఈడీ లైట్ల వాడకం
- గ్రామీణ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఈ-మార్కెటింగ్‌ సదుపాయ కల్పనకు నాబార్డు సాయం
- గ్యాంగ్‌మెన్లకు వైర్‌లెస్‌ రక్షక్‌ పేరుతో పరికరాల అందజేత. ఆన్‌లైన్లో పార్శిల్స్‌ బుకింగ్‌ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం
- 20వేల స్కానర్లతో 2వేల రైల్వేస్టేషన్లలో అత్యాధునిక నెట్‌వర్క్‌ ఏర్పాటు
- రైళ్లలో జీపీఎస్‌ ఆధారిత అత్యాధునిక సమాచార బోర్డులు, బోగీల లోపల డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటు
- వివిధ విభాగాల్లో ఆటోమేటిక్‌ వ్యవస్థ ఏర్పాటు. ఆటోమేటిక్‌ తలుపులు.. బార్‌కోడ్‌ రీడర్లు.. వాటర్‌లెవల్‌ ఇండికేటర్లు అందుబాటులోకి రానున్నాయి.

English summary
Union Railways Minister Suresh Prabhu will present his second Railway Budget in Parliament on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X