బంగ్లాతో మ్యాచ్‌పై మోడీ, అంతా అయిపోలేదని రైనా చురక

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పైన భారత జట్టు గెలిచిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చాలా థ్రిల్లింగ్ గేమ్ అని, టీమిండియాకు కంగ్రాట్స్ అని తెలిపారు. బంగ్లాదేశ్ బాగా ఆడింది అన్నారు.

అంతేకాదు, మోడీ ట్విట్టర్ లింక్‌లో సురేష్ రైనా ట్వీట్ లింక్ చేశారు. అందులో 'అంతా అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. జీవితం ఏ క్షణమైనా మలుపు తిరుగుతుంది. చివరి వరకూ పోరాడాలన్న ఆశే మనకు విజయాన్ని అందిస్తుంది' అన్నారు.

బంగ్లా - భారత్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. మ్యాచ్ దాదాపు భారత్ చేజారినట్లు కనిపించింది. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఒకింత సంబరంగా కనిపించారు. అయితే, అనూహ్యంగా మ్యాచ్ భారత్ వశమైంది.

Suresh Raina to Mushfiqur Rahim: 'Don't celebrate before you win'

దీనిపై సురేష్ రైనా ట్వీట్ చేశారు. చివరి వరకు చూడాలని, గెలవడానికి ముందే సెలబ్రేషన్స్ వద్దని, బంగ్లాదేశ్ జట్టు ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అంతేకాదు 'భారత్ - బంగ్లా గేమ్ ఆసక్తికరంగా సాగింది' అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియా భారత్‌కు అభినందనలతో మారుమోగిపోయింది. ఆట పూర్తికాకముందే సంబరాలకు దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్ల చిత్రాన్ని, దాని పక్కనే కూల్‌గా వికెట్ల వెనుక కనిపిస్తున్న ధోనీని చూపుతూ కామెంట్ల మీద కామెంట్లు వచ్చాయి.

అసలు ఇలాంటి మ్యాచ్ తానెప్పుడూ ఆడలేదని, అద్భుతమైన పోటీ తొలిసారిగా ఎదురైందని ఆట చివర్లో క్యాచ్ పట్టిన శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ కూడా అద్భుతంగా ఆడిందని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. సామాజిక అనుసంధాన వేదికల్లో ఈ మ్యాచ్‌పై జోరుగా చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+