వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahanam (Solar Eclipse) జూన్ 2021: ఎప్పుడు, ఏ సమయంలో కనిపిస్తుంది?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతు చిక్కని, అంతే లేని అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు. ఈ నెల 10వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి.

భారత్‌లో ఈ సూర్యగ్రహణం మధ్యహ్నం ఒంటిగంటా 42 నిమిషాలకు ఆరంభమౌతుంది. సాయంత్రం 6:41 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది. టైమ్ అండ్ డేట్ అనే వెబ్‌సైట్ వేసిన అంచనాల ప్రకారం.. భారత్‌లో ఇది కనిపించదు. రష్యా, గ్రీన్‌ల్యాండ్, కెనడా ఉత్తర ప్రాంతంలల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఆసియా ఉత్తర ప్రాంత దేశాలు, ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్, యూరప్, అమెరికా దేశాల్లోనూ పాక్షికంగా దర్శనమిస్తుందీ సూర్యగ్రహణం.

Surya Grahan 2021: Will the first solar eclipse of this year on June 10 Date, Timings

Recommended Video

Sonu Sood A Superhero - KTR Tweets | Oneindia Telugu

భారత్‌లో ఇది కనిపించే వీలు ఏమాత్రం లేదు. అయినప్పటికీ- టైమ్ అండ్ డేట్ డాట్ కామ్ సంస్థ దాన్ని ప్రత్యక్షంగా చూసే వీలు కల్పించింది. సూర్యగ్రహణానికి సంబంధించిన లైవ్ స్ట్రీమ్‌ను ప్రసారం చేయనుంది. సూర్యగ్రహణం ప్రారంభ సమయం నుంచి పూర్తిగా ముగిసిపోయేంత వరకూ ఈ లైవ్ స్ట్రీమ్ కొనసాగుతుందని ఆ సంస్థ వెల్లడించింది. పాక్షిక సూర్యగ్రహణం కావడం వల్ల భూమి ఛాయ సూర్యడి మీదుగా ప్రయాణించినప్పుడు దాన్ని పూర్తిగా కప్పేయదు. ఫలితంగా రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతుంది. చుట్టూ భగభగ మండే అంచులు. మధ్య గ్రహణ ఛాయతో సూర్యుడు కనిపిస్తాడు.

కాగా.. సూర్యగ్రహణం ఉచ్ఛస్థితికి చేరినప్పుడు ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్‌ను గ్రీన్‌ల్యాండ్‌లో సంపూర్ణంగా కనిపిస్తుంది. గ్రీన్‌ల్యాండ్, సెర్బియాతో పాటు ఉత్తర ధృవానికి అంచున ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా రింగ్ ఆఫ్ ఫైర్ చూడగలుగుతారని టైమ్ అండ్ డేట్ పేర్కొంది. ఈస్ట్‌కోస్ట్, అప్పర్ మిడ్‌వెస్ట్ దేశాల ప్రజలు పాక్షికంగా ఈ అద్భుతాన్ని చూడొచ్చు. దీని తరువాత డిసెంబర్ 4వ తేదీన మరోసారి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా భారత్‌లో కనిపించే అవకాశాలు లేవని స్కైవాచర్స్ చెబుతున్నారు.

English summary
Surya Grahan 2021: The first annular solar eclipse of this year will take place on June 10. This phase of eclipse takes place when the Moon passes between Earth and the Sun, partly obscuring the Sun's image for the sky watcher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X