సుష్మ, జైట్లీ మీ వల్లే చనిపోయారు.. ఉదయనిధి హాట్ కామెంట్స్, తిప్పికొట్టిన వారసులు

డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల వేళ.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ కేంద్రమంత్రులు సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణానికి కారణం మోడీయే అంటూ విరుచుకుపడ్డారు. ఒత్తిడి, వేధించడం వల్లే వారిద్దరూ నేతలు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వెంకయ్యనాయుడు లాంటి నేతలను పక్కనపెట్టారని ఆరోపించారు. అందుకోసమే ఉప రాష్ట్రపతి పదవీ ఇచ్చారని తెలిపారు.

 Sushma Swaraj, Arun Jaitley died due to Modis torture

మోడీకి తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా లొంగిపోయారని చెప్పారు. ఆయన భయపడుతున్నారని.. అందుకోసమే వంగి వంగి దండాలు పెడుతున్నారని చెప్పారు. కానీ తాను అలా కాదని.. కలైంగర్ కరుణానిధి మనమడినని చెప్పారు. ఉదయనిధి కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై సుష్మ, అరుణ్ వారసులు స్పందించారు.

ఎన్నికల కోసం తన తల్లి పేరును వాడుకొవద్దని సుష్మ కూతురు బన్సూరి తెలిపారు. మీరు చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని ఫైరయ్యారు. ప్రధాని మోడీ తన తల్లిని గౌరవించారని చెప్పారు. తమకు బీజేపీ అండగా నిలిచిందని వివరించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఉదయనిధి కామెంట్స్ అవమానపరిచేలా ఉన్నాయని చెప్పారు. అలాగే అరుణ్ జైట్లీ కూతురు సోనాలి కూడా స్పందించారు. ఉదయనిధి కామెంట్స్ ముమ్మాటికీ తప్పు అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+