వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు షాక్: 'గిల్గిత్ -బాలిస్థాన్, జమ్మూ,కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే'

పాకిస్తాన్ కు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ గట్టి షాకిచ్చారు. జమ్ముకాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్ -బాలిస్థాన్ కూడ భారత్ లో అంతర్భాగమేనని చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ గట్టి షాకిచ్చారు. జమ్ముకాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్ -బాలిస్థాన్ కూడ భారత్ లో అంతర్భాగమేనని చెప్పారు.

గిల్గిత్ -బాలిస్థాన్ లను ఐదో ప్రావిన్స్ గా పాక్ ప్రకటించిన నేపథ్యంలో లోక్ సభలో బిజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మెహ్ తాజ్ లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

పాక్ తీరుపై భారత్ ఏం చేయనుంది ఆయన ప్రశ్నించారు.పాక్ తీరును ఎండగడుతూ పార్లమెంట్ తీర్మాణం చేయాలని ఆయన కోరారు.దేశ విభజన సమయంలో గిల్గిత్ -బాలిస్థాన్ కు ఇంచార్జ్ గా ఉన్న బ్రిటీష్ ఏజంట్ పాక్ సైన్యాన్ని అనుమతించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొనేలా చేశారని ఆయన గుర్తు చేశారు.

Sushma Swaraj

ఈ ప్రాంతాన్ని ఇండియా భారత్ తన అంతర్భాగమనే చెబుతోంది. గిల్గిత్ -బాలిస్థాన్ ను పాకిస్థాన్ ఐదో ప్రావ్సిన్ గా ప్రకటించడాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఖండిస్తూ తీర్మాణం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఐదో ప్రావిన్స్ గా పాకిస్థాన్ చేసిన ప్రకటనను తాము తిప్పికొట్టిన విషయాన్ని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ గుర్తు చేశారు.పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా జమ్ము కాశ్మీర్ భారత్ దేశానికి చెందిందని పార్లమెంట్ ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

English summary
External Affairs Minister Sushma Swaraj on Wednesday slammed Pakistan's move to declare Gilgit-Baltistan as its fifth province and said the whole of Jammu and Kashmir, including areas under Pakistan's occupation, is Indian territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X