కిడ్నాప్ చేసిన బాలికపై గ్యాంగ్ రేప్ చేసి, చంపేశారు

బెంగళూరు: బాలికపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని జీవర్గి ప్రాంతంలో జరిగింది. జీవర్గి తాలుకా అరలగుండగి ప్రాంతంలో నివాసం ఉంటున్న 14 సంవత్సాల బాలిక మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు చెప్పారు.

మార్చి 30వ తేదీన గ్రామంలో ఉన్న తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన సిద్దప్ప శివశరణప్ప అనే యువకుడు, అతని 7 గురు స్నేహితులు కిడ్నాప్ చేశారని బాలిక తండ్రి యడ్రామి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Suspect arrested for rape and murder of 14-year- geevargi girl

అప్పటి నుండి ఎస్ ఐ ఎస్.ఎస్ హుల్లూర్ తన సిబ్బందితో కలిసి బాలిక, కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామం శివార్లలోని ఒక కిలో మీటరు దూరంలో ఉన్న చెరుకు తోటలో బాలిక శవం కనిపించింది. మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తున్నది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైయ్యింది తన కుమార్తె అని బాలిక తండ్రి గుర్తించారు. బాలిక మీద సామూహిక అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్దారించారు. పోలీసులు సిద్దప్ప శరణప్పను అదుపులోకి తీసుకున్నారు. బాలికను అతనే స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశాడా అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+