• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకేకు కాంగ్రెస్ సీనియర్ల షరతు-టీఆర్ఎస్, వైసీపీలకు ఝలక్-ఒప్పుకుంటేనే ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పూర్తి స్ధాయిలో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఎప్పటినుంచో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందుకు తగినట్లుగానే ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఇతర నేతలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం భారీ ప్లాన్ కూడా ఇచ్చారు. దీనిపై అధ్యయనం కోసం సోనియాగాంధీ సీనియర్లతో ఓ కమిటీ కూడా వేశారు. అయితే ఈ కమిటీ విధించిన ఓ షరతు ఇప్పుడు పీకేని చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఎంట్రీ

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఎంట్రీ

వరుస పరాజయాలతో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీపై దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇస్తే తమ పార్టీ భవిష్యత్తు మారుతుందని చాలా మంది నేతలు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది లేదంటున్నారు. ఈ రెండూ కాక మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి ప్రాంతీయ పార్టీలతో పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీకి వ్యూహకర్తగా పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరైతే పీకేని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా స్ధానిక ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేయొచ్చని ఎదురుచూస్తున్నారు.

పీకే ఎంట్రీపై సస్పెన్స్

పీకే ఎంట్రీపై సస్పెన్స్

కాంగ్రెస్ పార్టీలోకి పీకేను తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలుసాగుతుండగా.. ఇది ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పీకే ఎంట్రీ కంటే ముందు ఆయన ఇచ్చిన ప్లాన్, పార్టీలోకి వస్తే ఆయనకు ఏ స్ధానం ఇవ్వాలన్న దానిపై అధినేత్రి సోనియాగాంధీ సీనియర్ నేత చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలో కేసే వేణుగోపాల్, రాహుల్, ప్రియాంక, ఆంటోనీ, సూర్జేవాలా, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్లు ఉన్నారు. వీరు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ లోకి పీకే ఎంట్రీని, ఆయన స్ధానాన్ని నిర్ణయించబోతున్నారు. వీరు విధిస్తున్న షరతుల్ని ఒప్పుకుంటే కాంగ్రెస్ లో పీకే ఎంట్రీ ఖాయమవుతుంది.

పీకేకు కాంగ్రెస్ షరతు ఇదే

పీకేకు కాంగ్రెస్ షరతు ఇదే


కాంగ్రెస్ లోకి పీకేను తీసుకునేందుకు కాంగ్రెస్ నియమించిన కమిటీ విధిస్తున్న ప్రధాన షరతు ఇతర పార్టీలతో పనిచేయకూడదని. కానీ దీన్ని నేరుగా అంగీకరించేందుకు పీకే సిద్ధంగా కనిపించడం లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్, వైసీపీ వంటి యూపీఏ కూటమిలో లేని పార్టీలతో పీకే పనిచేయడం కాంగ్రెస్ కు అస్సలు ఇష్టం లేదు. ఇన్నాళ్లూ పీకే ఏం చేసినా ఫర్వాలేదు. కానీ ఓసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలకు పనిచేస్తే ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ ఏం కావాలనే ప్రశ్న వీరు వేస్తున్నారు. దీనికి సమాధానంగా పీకే తాను నేరుగా పనిచేయబోనని, తన సంస్ధ ఐప్యాక్ మాత్రమే పనిచేస్తుందని, అందులో తాను తలదూర్చనని చెప్తున్నారు. కానీ దీనికి కాంగ్రెస్ సీనియర్లు అంగీకరించడం లేదు.

 వైసీపీ, టీఆర్ఎస్ లకు ఝలక్

వైసీపీ, టీఆర్ఎస్ లకు ఝలక్


కాంగ్రెస్ లోకి పీకే ఎంట్రీ కోసం సీనియర్లు విధిస్తున్న షరతును ఆయన అంగీకరిస్తే మాత్రం ముందుగా దెబ్బపడేది టీఆర్ఎస్, వైసీపీపైనే. ఇప్పటికే ఓసారి పీకే సేవల్ని తీసుకుని భారీ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ మరోసారి ఆయన సేవలపై ఆధారపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అటు టీఆరఎస్ కూడా తాజాగా ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకునే నిర్ణయం ఈ రెండు పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఈ రెండు పార్టీలకు పీకే దూరమైతే మాత్రం జగన్, కేసీఆర్ లకు కచ్చితంగా భారీ ఎదురుదెబ్బగా మారనుంది.

English summary
prashant kishor's entry into congress has been delayed with seniors objections on his work with other parties simultaneously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X