హెచ్1బీ వీసా: భారత్ ఐటీ సంస్థలపై ప్రభావం, కానీ
హెచ్1బీ వీసా దరఖాస్తులకు సంబంధించి ప్రీమియం ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రభావం భారత ఐటీ సంస్థల పైన కూడా పడుతుందని నాస్కాం పేర్కొంది.
ముంబై: హెచ్1బీ వీసా దరఖాస్తులకు సంబంధించి ప్రీమియం ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రభావం భారత ఐటీ సంస్థల పైన కూడా పడుతుందని నాస్కాం పేర్కొంది.
భారత్, అమెరికన్ సంస్థలకు సంబంధించిన వీసాలను పరిష్కరించడంలో కొంత జాప్యం చేసుకుంటుందని తెలిపింది. అయితే, సదరు జాప్యం తీవ్ర అవరోధంగా ఏమీ పరిణమించబోదని అభిప్రాయపడింది.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకుగాను గతంలోనూ ఇలాంటి సేవలను రెండు నెలలపాటు నిలిపివేశారని తెలిపింది. తాజా నిర్ణయం కారణంగా నిపుణుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగాను భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో కలిసి కృషి చేస్తామని చెప్పింది.












Click it and Unblock the Notifications