ఏమై ఉంటుంది?: బాత్రూమ్‌లో విగతజీవిగా యువ ఇంజనీర్..

Subscribe to Oneindia Telugu

బనశంకరి: అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూ స్థానికంగా ఓ హాస్టల్ లో ఉంటున్న యువకుడు సోమవారం నాడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని కర్ణాటకలోని చిక్కమంగళూరు వాసిగా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. వసంతకుమార్(24) బెంగుళూరులోని ఐటీపీఎల్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నారాయణపురలోని వీఆర్ఎస్ ఔట్ లెట్ లో స్నేహితుడు రంజిత్ తో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం రంజిత్ విధులకు వెళ్లగా.. వసంతకుమార్ హాస్టల్లోనే ఉండిపోయాడు.

suspicious death of an assistant engineer in bengaluru

విధులు ముగించుకుని రంజిత్ సాయంత్రం హాస్టల్ కు చేరుకున్నాడు. బాత్రూమ్ వైపు వెళ్లగా.. వసంతకుమార్ అక్కడ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vasanth Kumar, A 24years old was died at hostel in Bengaluru. He was working as an assistant engineer at ITPL company
Please Wait while comments are loading...