Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమించి పెళ్ళాడిన యువతి అనుమానాస్పద మృతి: భర్తే చంపేశాడు.. బంధువుల ఫిర్యాదు!!

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి, కొద్ది నెలల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చిక్ బ‌ళాపూర్‌ లో చోటుచేసుకుంది. చిక్ బ‌ళాపూర్‌కు చెందిన అభిలాష్ బాగేప‌ల్లి తాలూక ఆశేప‌ల్లికి చెందిన అనూష‌ను ప్రేమించాడు. ఇద్ద‌రు కొద్ది నెల‌ల క్రితం పెళ్లి చేసుకుని చిక్‌బ‌ళాపూర్‌లో కాపురం ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూష శుక్రవారం రాత్రి విగతజీవిగా మారింది. అయితే అనూష ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అభిలాష్ చెప్తుంటే, భర్తనే అనూషను హతమార్చాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రేమ పెళ్లి ... ఆపై యువతి అనుమానాస్పద మృతి

ప్రేమ పెళ్లి ... ఆపై యువతి అనుమానాస్పద మృతి


బాధిత యువతి తల్లిదండ్రులు చిక్ బ‌ళాపూర్‌ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అభిలాష, అనూష ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులతో పనిలేదని, తనతో వస్తే జీవితాంతం ప్రేమగా చూసుకుంటానని మాటిచ్చి మరీ అనూష ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులతో మాట్లాడకుండా జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైనా అనూషతో మాట్లాడాలి అని తల్లిదండ్రులు ప్రయత్నించినా ఎక్కువసేపు మాట్లాడనిచ్చేవాడు కాదని, వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూష భర్త హతమార్చాడు అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అనూషను హతమార్చింది భర్తే .. తల్లిదండ్రుల ఆరోపణ

అనూషను హతమార్చింది భర్తే .. తల్లిదండ్రుల ఆరోపణ


శుక్రవారం రాత్రి అభిలాష అనూషను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ముందు తమకు ఆరోగ్యం సీరియస్ గా ఉందంటూ ఫోన్ చేశాడని, ఆసుపత్రిలో ఉంది రావాలని చెప్పాడని అనూష బంధువులు చెబుతున్నారు. ఇక ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పినట్టుగా వారు పేర్కొన్నారు. అయితే అనూష చెవుల నుండి, చేతుల దగ్గర రక్తం వచ్చినట్టుగా గాయాలు అయిన దాన్నిబట్టి తమ కుమార్తెను అల్లుడు కొట్టి చంపినట్టు అనుమానాలున్నాయని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల తీరుపైనా బాధిత కుటుంబం ఆరోపణలు

పోలీసుల తీరుపైనా బాధిత కుటుంబం ఆరోపణలు


ఇక పోలీసులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతున్నారని, అనూష శవాన్ని చూడటానికి కూడా నిరాకరించారని పేర్కొన్నారు. కనీసం ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతించలేదని తెలిపారు. నిందితుడు అభిలాష్ పోలీస్ స్టేషన్లో దర్జాగా కూర్చున్నాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీసులు సమాధానం చెప్పలేదని పోలీసుల తీరుపై కూడా అనూష తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీడియాకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా గోప్యంగా ఉంచారని వారంటున్నారు.

 తమకు న్యాయం జరగకుంటే కర్ణాటక సీఎంను కలుస్తాం

తమకు న్యాయం జరగకుంటే కర్ణాటక సీఎంను కలుస్తాం


తన బిడ్డ హత్య కేసును తారుమారు చేయడానికి పోలీసులు కూడా నిందితులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అభం శుభం తెలియని తన బిడ్డను హతమార్చిన వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే, తమకు న్యాయం చెయ్యకపోతే తాము కర్ణాటక సీఎం ను కలుస్తామని వారంటున్నారు. హత్య కేసుతో పాటు, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్న తమకు మహిళా సంఘాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+