బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Swamiji: స్వామీజీ కేసులో షాక్, పోలీసు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్, మేడమ్ ఏం చెబుతుందో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించారు. ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది. శ్రీబసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠానికి చెందిన స్వామీజీ, ఓ లాయర్, ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో అరెస్టు అయిన ముగ్గురిని విచారణ చెయ్యడానికి పోలీసు కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో మ్యాటర్ మొత్తం బయటకు లాగాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Girlfriend: ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసింది, కన్నింగ్ లేడీ కథ క్లోజ్ !Girlfriend: ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసింది, కన్నింగ్ లేడీ కథ క్లోజ్ !

 స్వామీజీ ఆత్మహత్య కేసు

స్వామీజీ ఆత్మహత్య కేసు

బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించారు. ఈ కేసు ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

 దాయాది స్వామీజీ

దాయాది స్వామీజీ

బండే మఠం మఠాధిపతిగా శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ శ్రీ బసవలింగ స్వామీజీ, కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ దాయాదులు. ఇద్దరూ బండే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మద్య ఆస్తి తగాదాలు, మఠం స్వాధీనం విషయంలో కొంతకాలం గొడవలు జరుగుతున్నాయని వెలుగు చూసింది.

 కాలేజ్ అమ్మాయితో ?

కాలేజ్ అమ్మాయితో ?

బండే మఠం మఠాధిపతిగా శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీతో పాటు కర్ణాటకలోని దోడ్డబళ్లాపురం సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండో సంవత్సరం చదువుతున్న నీలాంబిక అలియాస్ నీలాంబికే అనే యువతి, తుమకూరుకు చెందిన లాయర్ మహదేవయ్య అరెస్టు కావడం కలకలం రేపింది.

 ఐదు రోజులు పోలీసు కస్టడీ

ఐదు రోజులు పోలీసు కస్టడీ

స్వామీజీ ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన ముగ్గురిని సోమవారం మాగడిలోని జేఎంఎం కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులను విచారణ చెయ్యడానికి తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో మనవి చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన మృత్యుంజయ స్వామీజీ, కాలేజ్ అమ్మాయి నీలాంబికే, లాయర్ మహదేవయ్యను విచారణ చెయ్యడానికి ఐదు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వడానికి మాగడి జేఎంఎఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీకి తీసుకున్న పోలీసులు ముగ్గురి నుంచి మ్యాటర్ మొత్తం బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నారని సమచారం.

English summary
Swamiji: Bandemutt Basavalinga Shree case, accuses handover Magadi police custody near Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X