Swamiji: స్వామీజీ కేసులో ట్విస్ట్, మరో మఠం స్వామీజీ, ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి, లాయర్ అందర్ !
బెంగళూరు/రామనగర: కర్ణాటకలోని బండేమఠం మఠాధిపతి శ్రీ బసవలింగ స్వామీజీ (45) ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇటీవల రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించారు. గదిలోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు. స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలు మొదట బయటకు రాలేదు. అయితే స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు 8 పేజీల డెత్ నోట్ రాశారని, అందులో మొదటి పేజీ, చివరి మూడు పేజీలు పోలీసులకు చిక్కాయని, మధ్యలో పేజీలు మాయం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే శ్రీబసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠానికి చెందిన స్వామీజీ, ఓ లాయర్, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి అరెస్టు కావడం కలకలం రేపింది.
Wife:
వేరువేరు
కాపురాలు,
భార్యను
పొడిచి
చంపేసి
శవం
మీదపడుకుని
విలపించిన
భర్త,
అసలు
మ్యాటర్
?

స్వామీజీ ఆత్మహత్య
బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) పని చేస్తున్నారు. కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామీజీ భక్తుల దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించారు.

సుమోటో కేసు
కంచుగల్ బండే మఠంలో మఠాధిపతి బసవలింగ స్వామీజీ బసచేసే గదిలోని కిటికీకి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాశారని పోలీసులు అన్నారు. బసవలింగ స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలు బయటకురాలేదు. స్థానిక పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేశారు.

లేడీ పేరు రాసిన స్వామీజీ
శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు 8 పేజీల డెత్ నోట్ రాశారని, అందులో మొదటి పేజీ, చివరి మూడు పేజీలు పోలీసులకు చిక్కాయని, మధ్యలో పేజీలు మాయం అయ్యాయని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. శ్రీ బసవలింగ స్వామీజీ రాసిన డెత్ నోట్ లో ఓ మహిళ పేరు ప్రస్తావించారని, ఆమె టార్చర్ ఎక్కువ అయ్యిందని స్వామీజీ డెత్ నోట్ లో రాశారని వెలుగు చూసింది.

స్వామీజీ కేసులో మరో స్వామీజీ అరెస్టు
కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ అరెస్టు కావడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ శ్రీ బసవలింగ స్వామీజీ, కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ దాయాదులు. ఇద్దరూ బండే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మద్య ఆస్తి తగాదాలు, మఠం స్వాధీనం విషయంలో కొంతకాలం గొడవలు జరుగుతున్నాయని వెలుగు చూసింది.

ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి అందర్
బండే మఠం మఠాధిపతిగా శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీతో పాటు కర్ణాటకలోని దోడబ్బళ్లాపురంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న నీలాంబిక అలియాస్ చందు అనే యువతి, తుమకూరుకు చెందిన లాయర్ మహదేవయ్య అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

కాలేజ్ అమ్మాయితో హనీట్రాప్
ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి నీలాంబికతో శ్రీ బసవలింగ స్వామీజీ చనువుగా ఉంటున్నాడని తెలుసుకున్న ఆయన సోదరుడు, కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ, లాయర్ మహదేవయ్య కలిసి ఆరు నెలల నుంచి శ్రీ బసవలింగ స్వామీజీ మీద హనీట్రాప్ స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఆస్తి, మఠం స్వాదీనం చేసుకోవాలని ?
ఫిబ్రవరి నెల నుంచి హనీట్రాప్ స్కెచ్ వేసిన ఏప్రిల్ నెల నుంచి శ్రీబసవలింగ స్వామీజీ అర్ధనగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు చిత్రీకరించారని, తరువాత వాటిని లాయర్ మహదేవయ్య ఇంజనీరింగ్ అమ్మాయి ముఖం కనపడకుండా ఎడిటింగ్ చేసి ఆ వీడియోలు వీరశైవ మఠాధిపతులు అందరికి పంపించారని పోలీసులు అంటున్నారు. ఇదే విషయంలో అవమానంగా బావించిన శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారని వెలుగు చూసింది.

అమ్మాయిని విచారణ చేస్తున్నారు
శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీతో పాటు కర్ణాటకలోని దోడబ్బళ్లాపురంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న నీలాంబిక అలియాస్ చందు అనే యువతి, తుమకూరుకు చెందిన లాయర్ మహదేవయ్య అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.