ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: రామ్ కుమారే చంపేశాడు.. సాక్షి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్‌లో జరిగిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసును సీబీఐచే దర్యాఫ్తు చేయించాలని నిందితుడైన రామ్ కుమార్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తిరునల్వేలి జిల్లా మీనాక్షిపురంకు చెందిన రామ్ కుమార్‌ మంగళవారం దోష నిర్ధారణ పరీక్షలో పాల్గొంటున్నాడు.

సివిల్‌ న్యాయమూర్తి సమక్షంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు స్థానిక పుళల్‌ సెంట్రల్‌ జైలులో రామ్ కుమార్‌ ఎదుట పలువురు సాక్షులను పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు స్వాతిని హత్య చేయలేదని, దీనిపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూస్తాయని రామ్ కుమార్‌ తండ్రి పరమశివం అంటున్నారు.

Also Read: ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, కులం కార్డ్: 'రామ్ కుమార్‌ని ఎవరూ కాపాడలేరు'

లాయర్ ప్రశ్నల వర్షం

ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ సమగ్రంగా లేదని, రామ్ కుమార్‌ న్యాయవాది రామ్‌రాజ్‌ మీడియాకు తెలిపారు. స్వాతి హత్య కేసులో రామ్ కుమార్‌ నేరస్థుడని ఇంకా తేలలేదని, ఆయనపై నింద మోపి పోలీసులు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారన్నారు.

Swathi murder: Ramkumars family seek CBI probe

రామ్ కుమార్‌ తరపున కోర్టులో హాజరయ్యేందుకు శంకర్‌ సుబ్బు, గురుమూర్తిలతో ఏర్పాటైన బృందం రామ్ కుమార్‌ను నిర్ధోషిగా విడుదల చేయిస్తుందన్నారు. రామ్ కుమార్‌ను దోషి నిర్ధారణ పరీక్షకు హాజరుపరచడం చట్ట వ్యతిరేకమన్నారు.

Also Read: స్వాతి హత్య: రామ్ కుమార్ కోసం వాగుడు కాయలు

స్వాతి హత్యకేసులో రామ్‌కుమార్‌ అరెస్టుకు సంబంధించిన ఫోటోలు, అతడు గొంతుకోసుకుంటున్న ఫోటోతో సహా పత్రికలకు విడుదల చేసిన తర్వాత ఈ దోషి నిర్ధారణ పరీక్ష జరపటం అన్యాయమన్నారు. సాధారణంగా ఒక హత్య కేసులో నిందితుడి ఫోటోలను వెల్లడించని సందర్భాలలోనే దోషి నిర్ధారణ పరీక్ష జరపటం పరిపాటి అని, అయితే రామ్ కుమార్‌ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారన్నారు.

రామ్ కుమార్ చంపేశాడు: సాక్షి

స్వాతి హత్య నేపథ్యంలో రామ్ కుమార్‌కు జైలులో నేర నర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం నాడు మధ్యాహ్నం పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్లో రామ్ కుమార్‍‌తో పాటు 25 మంది నిందితులను వరుసగా నిల్చోబెట్టారు.

స్వాతి తండ్రి, హత్య జరిగిన రైల్వే ప్లాట్ ఫైం పైన దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. వారందర్నీ చూసిన స్వాతి తండ్రి రాం కుమారే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పాడు. హత్య జరిగిన ప్రాంతంలో షాపు నడుపుతున్న వ్యక్తి కూడా రాం కుమార్ పేరే చెప్పాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ramkumars family will seek a CBI probe into the murder of Infosys employee Swathi at Nungambakkam railway station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి