సీఎం కేజ్రీవాల్ పీఎస్ అరెస్ట్..!!
MP Swati Maliwal assault case: లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అరెస్టు పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకదాని తరువాత ఒకటి అన్నట్టుగా కష్టాలు చుట్టుముట్టాయి.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిందన్న ఆనందం కూడా ఆ పార్టీలో కరువైంది. ఆ సంతోషాన్ని హరించేలా పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. తాజాగా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఉదంతం.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్భి బిభవ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్వాతి మలివాల్‌పై దాడి చేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. బూతులు తిట్టి, ఆమెను కొట్టిన ఘటనలో బిభవ్ కుమార్‌పై ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ నెల 13వ తేదీన కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడ్డాడు బిభవ్ కుమార్. ముఖం, ఛాతీ, వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బిభవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయనను అరెస్ట్ చేశారు.
బిభవ్ కుమార్ వాదనలు వేరుగా ఉన్నాయి. కొద్దిసేపు వెయిట్ చేయాలంటూ సెక్యూరిటీ సిబ్బంది సూచించినప్పటికీ దురుసుగా ఆమె కేజ్రీవాల్ ఇంట్లోకి చొరబడ్డారని బిభవ్ కుమార్ చెబుతున్నారు. కొద్దిసేపు వెయిటింగ్ లాంజ్‌లో కూర్చున్న తరువాత హఠాత్తుగా ఇంట్లోకి దూసుకొచ్చారనిచ ఆమెను అడ్డుకున్నానని లిఖితపూరకంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications