మోడీకి బెదిరింపు: పోలీసుల అదుపులో విదేశీయులు
పనాజీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు బెదిరింపు లేఖ వచ్చిన కేసులో గోవా పోలీసులు సిరియాకు చెందిన ఓ వ్యక్తి, మరో ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.
వారిద్దరూ యెమన్, నైజీరియాలకు చెందిన వారని, ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వెల్లడించారు. మోడీ, పారికర్‌లను చంపుతామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఇటీవల గోవా సెక్రటేరియట్‌కు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

ఉగ్ర ముప్పు రాష్ట్రాలకు మరింత భద్రత
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాద ముప్పు పొంచివున్న రాష్ట్రాల్లో భద్రత పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమ్మూకాశ్మీర్‌తో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 17 రిజర్వు బెటాలియన్లు పంపాలని నిర్ణయించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటయ్యే కేంద్ర ప్రత్యేక బలగాల్లో నియామకాలపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ముందు లొంగిపోయిన ప్రభుత్వానికి సహకరిస్తున్న వారిని ఈ నియామకాల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది.
జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థకు అధీకృత మూలధనం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యికోట్ల నుంచి రూ. 1200 కోట్లకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications