బస్సు అదుపుతప్పి ఆరు మంది దుర్మరణం: 39 మందికి తీవ్రగాయాలు, వేకువ జామున పైలోకాలకు !

గర్వా: వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి పల్లంలోకి పడిపోవడంతో ఆరు మంది దుర్మరణం చెంది 39 మందికి తీవ్రగాయాలైన ఘటన జార్ఖండ్ లోని గర్వా ప్రాంతంలో జరిగింది. మంగళవారం వేకువ జామున జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

మంగళవారం వేకువ జామున గర్వా ప్రాంతం వైపు బస్సు వేగంగా వెళ్లింది. ఆ సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్లంలోకి పడిపోయింది. బస్సు ఒక్కసారిగా పల్టీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది సంఘటనా స్థలంలోనే మరణించారు.

Recommended Video

    ఝార్ఖండ్ లో దాడులకు తెగబడ్డ మావోయిస్టులు
    t least six people were killed and around 39 were left injured in the incident in Garhwa of Jharkhand.

    విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో తీవ్రగాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు సేకరిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

    డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వలన ప్రమాదం జరిగిందా, మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల పాట్నా నుంచి ఎన్ హెచ్ -2 మార్గంలో జార్ఖండ్ వైపు వేగంగా వెలుతున్న ట్రక్ బస్సును ఢీకొనడంతో చిన్నారితో సహ 12 మంది దుర్మరణం చెంది 22 మందికి తీవ్రగాయాలైనాయి. జార్ఖండ్ లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+