Budget 2022: సంప్రదాయ బాహీ ఖాటాకు బదులు స్వదేశీ ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్ ఎంట్రీ

న్యూఢిల్లీ: మరికొద్ద సేపట్లో పార్లమెంటులో బడ్జెట్, ఆర్థిక బిల్లుకు తెలపడం కోసం ప్రదానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ తర్వాత లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం కాగితరహితంగా ఉండనుంది.

అందుకే, ఈసారి సంప్రదాయ బాహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. ఇక, సభ్యులకు కూడా బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇవ్వనున్నారు. పరిమిత సంఖ్యలు ముద్రించిన బడ్జెట్ ప్రతులను కూడా పార్లమెంటుకు తీసుకొచ్చారు. వీటిని మీడియా సహా మరికొందరికి అందించనున్నారు.

కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై తమకు ఊరట కల్పిస్తారని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు ఇన్ కంట్యాక్స్ పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Tab Replaces Bahi Khata For 2nd Year, FM Sitharaman Arrives At Parliament

Recommended Video

    Union Budget 2022 : ఆ వేడుక లేనట్టే..చరిత్రలో ఇదే తొలిసారి..| Oneindia Telugu

    సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు, ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ కోరికను నిర్మలమ్మ మన్నిస్తారా? అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఇక, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.1లక్షకు పెంచాలంటున్నారు. నిర్మలమ్మ బడ్జెట్లో మౌలిక రంగంతోపాటు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించే వీలుందని నిపుణులు అంటున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌ వివరాలను రాష్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+