Tablighi Jamaat: వైద్యులపైనే ఉమ్మేస్తూ రోగుల వికృత చేష్టలు, వ్యాధి విస్తరించేలా..

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనావైరస్ నియంత్రణలోకి వస్తున్న తరుణంలో ఢిల్లీలో తబ్లిఘి జమాత్ మత సమ్మేళనం కలకలం రేపింది. ఈ సమ్మేళనంలో వివిధ దేశాలకు చెందినవారు, మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. విదేశాలకు చెందినవారికి కరోనావైరస్ సోకి ఉండటంతో సమ్మేళనంలో పాల్గొన్న ఇతర ముస్లింలకు కూడా వ్యాపించింది. వీరంతా తిరిగి దేశంలోని వారి రాష్ట్రాలకు వెళ్లడంతో అక్కడకూడా తీవ్రంగా వ్యాపించించింది. దీంతో కేంద్రం తీవ్రంగా స్పందించింది.

వైద్యులతో అభ్యంతరకరంగా..

వైద్యులతో అభ్యంతరకరంగా..

నిజాముద్దీన్ తబ్లిఘి జమాత్ మర్కత్‌లో ఉన్న 2361 మందిని గత 36 గంటల్లో అక్కడి నుంచి ఖాళీ చేయించింది. వీరిలో చాలా మందిని డీజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్ హాస్టల్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే, వీరు ఉద్దేశపూర్వకంగా చికిత్స అందిస్తున్న వైద్యులతో అభ్యంతకరంగా ప్రవరిస్తున్నారు.

వైద్యులను దూషిస్తూ..

వైద్యులను దూషిస్తూ..

వైద్యులు, వైద్య సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు దూషణకు దిగుతున్నారని అధికారులు తెలిపారు. ఆహారం విషయంలోనూ అనుచిత డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు. వైద్య సిబ్బంది పట్ల రోగుల ప్రవర్తన బాగోలేదని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ షిప్ ఆఫీసర్ దీపక్ కుమార్ కూడా వెల్లడించారు.

వైద్యులపైనే ఉమ్మేస్తూ.. వికృత చేష్టలు..

వైద్యులపైనే ఉమ్మేస్తూ.. వికృత చేష్టలు..

మర్కజ్‌ నుంచి వచ్చిన కరోనా బాధితులు క్వారంటైన్ సెంటర్ ప్రాంగణమంతా ఉమ్మివేశారని, అంతేగాక, వైద్యులు, సిబ్బందిపై ఉమ్మివేశారని దీపక కుమార్ తెలిపారు. హాస్టల్ బిల్డింగ్ అంతా తిరుగుతూ ఇలా చేస్తున్నారని చెప్పారు. మంగళవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో తబ్లిఘి జమాత్ నుంచి 167 మందిని తుగ్లకాబాద్ క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. వీరిలో 97 మందిని డీజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్ హాస్టల్ క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 70 మందిని ఆర్పీఎఫ్ బ్యారక్ క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. కాగా, వ్యాధి వ్యాపించేందుకే రోగులు ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Recommended Video

    14 Positive Cases in AP's West Godavari District Linked With Markaz Prayers | People Quarantined
    మర్కత్ వల్లే దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా బాధితులు

    మర్కత్ వల్లే దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా బాధితులు

    ఇది ఇలావుండగా, , నిజాముద్దీన్ వెస్ట్‌లోని తబ్లిఘి జమాత్ మర్కత్ నుంచి 2361 మందిని ఖాళీ చేయించామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. వీరిలో 617 మందిని ఆస్పత్రికి తరలించగా, మిగితా వాళ్లను క్వారంటైన్ సెంటర్లకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా, గత 24 గంటల్లోనే 386 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసోలేషన్ పడకల కోసం 5వేల రైల్వే కోచ్ లను ఆధునీకరించామని తెలిపారు. వీటిలో దాదాపు 3.2లక్షల ఐసోలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 47వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1637 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+