వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ వార్తల్లోకి ఎక్కిన తబ్లిగి జమాతీలు: సాహస నిర్ణయం.. పుణ్యకార్యంగా ప్లాస్మా దానం: ఏపీ, తెలంగాణలో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం అయ్యారనే అపవాదును ఎదుర్కొంటోన్న తబ్లిగీ జమాతీలు సాహస నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో చాలామంది ప్లాస్మా డొనేషన్‌ చేయడానికి ముందుకొస్తున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్లాస్మాను డొనేట్ చేయడాన్ని పుణ్యకార్యంగా భావిస్తున్నారని తెలుస్తోంది. తమిళనాడులో కొందరు తబ్లిగీ జమాతీలు ప్లాస్మాను దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

కిందటి నెల దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వారి వల్ల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని బాహటంగా వెల్లడించాయి. 70 శాతం మేర పాజిటివ్ కేసులు ఢిల్లి సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వల్లే పెరిగాయని చెప్పుకొన్నాయి.

Tablighi Jamaatees is ready to donate plasma for therapy

ఈ పరిస్థితుల్లో ఆ జామాతీలే మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కరోనా వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్న వారంతా ప్లాస్మాను దానం చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రత్యేకించి తమిళనాడులో తబ్లిగీ జమాతీలు బ్లడ్, ప్లాస్మాను డొనేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇస్తే.. తాము ప్లాస్మాను డొనేట్ చేస్తామని తబ్లిగి జమాతీ ప్రతినిధులు చెబుతున్నారు. తబ్లిగి జమాత్ ఏపీ, తెలంగాణ ఛాప్టర్ ప్రతినిధులు ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులను జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ రాజ్‌భవన్‌లో కలకలం: నలుగురికి పాజిటివ్ఏపీ రాజ్‌భవన్‌లో కలకలం: నలుగురికి పాజిటివ్

గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీని నిర్వహించడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో- కరోనా వైరస్ బారిన పడి, సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి ప్లాస్మాను సేకరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తబ్లిగీ జమాతీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే.. వారి నుంచి బ్లడ్, ప్లాస్మాను సేకరించ గలమని అధికారులు చెబుతున్నారు.

Recommended Video

Mann Ki Baat : Lockdown May Extend, PM Modi Warns Against Overconfident

కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలంటూ కొద్దిరోజుల కిందటే తబ్లిగి జమాత్‌ చీఫ్ మౌలానా సాద్‌ విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే. ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ పేషెంట్లు కోలుకుంటున్నారని, ఈ విధనాంలో అందజేస్తోన్న ట్రీట్‌మెంట్ సత్ఫలితాలను ఇస్తుండటంతో తబ్లిగీ జమాతీలు ప్లాస్మాను డొనేట్ చేయాలని మౌలానా సాద్ ఓ లేఖ రాశారు. రంజాన్ మాసంలో ప్లాస్మాను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

English summary
Tablighi Jamaat is ready to cooperate with the State governments and donate plasma for convalescent plasma therapy trials to treat COVID-19 patients. A senior Tablighi Jamaat worker said that three mosques had served as quarantine centres for workers and others as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X