వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ మహల్ 20 గదుల రహస్యం-తెరవాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిల్-ఏం తమాషాలా ?

|
Google Oneindia TeluguNews

యూపీలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ అందాలను పీక్షించని వారు, వీక్షించి పరవశించని వారు ఉండరు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ పేరుతో నిర్మించిన ఈ సమాధిని దేశంలో ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని సందర్శకులు తపిస్తుంటారు. కానీ వీరందరికీ భిన్నంగా పలు హిందూ సంస్ధలతో కలిసి బీజేపీ నేత ఒకరు ఇందులో ఉన్న 20 గదులు తెరిచి వాటి రహస్యం బయటపెట్టాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

 తాజ్ మహల్ 20 గదులు

తాజ్ మహల్ 20 గదులు

ఏటా లక్షలమంది సందర్శకులు తాజ్ మహల్ ను సందర్శిస్తుంటారు. వారంతా తాజ్ మహల్ రూపంతో పాటు నిర్మాణానికి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు, అక్కడ ఫొటోలు దిగి వాటిని తమ ఇళ్లలో భద్రపర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ప్రేమికుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ అపురూప కట్టడం శతాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా చరిత్రలో నిలిచి ఉంది. మొఘల్ సామ్రాజ్యం అంతమైనా తాజ్ మహల్ ను ఇప్పటివరకూ దేశ సంపదగానే ప్రభుత్వాలు కూడా భావిస్తూ వచ్చాయి. కనీసం అందులో ఏముందనే విషయం కూడా పట్టించుకోలేదు. కానీ ఇన్నాళ్లకు దీనిపై దాడి మొదలైంది. తాజ్ మహల్ లో ఉన్న 20 మూసి ఉంచిన గదుల్లో ఏముందో తేల్చాలనే వాదన ను కొన్ని హిందూ అతివాద సంస్ధలు మొదలుపెట్టాయి. బీజేపీ దీనికి వంతపాడుతోంది.

20 గదుల రహస్యం తేల్చాలంటూ పిల్

20 గదుల రహస్యం తేల్చాలంటూ పిల్

తాజ్ మహల్ లో ఉన్న 20 గదుల రహస్యం తేల్చాలంటూ అలహాబాద్ హైకోర్టులో తాజాగా ఓ పిల్ దాఖలైంది. బీజేపీకి చెందిన స్ధానిక ఇన్ ఛార్జ్ రజనీష్ సింగ్ ఈ పిల్ దాఖలు చేశారు. అంతటితో ఆగకుండా దీన్ని తవ్వి రహస్యం బయటపెట్టేలా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఇతర సంస్ధలకు ఆదేశాలు ఇవ్వాలని, కేంద్రాన్ని కూడా ఆధేశించాలని పలు ప్రజా ప్రయోజనవాజ్యాల పేరుతో పిటిషన్లు దాఖలు చేశాడు. దీంతో అలహాబాద్ హైకోర్టుఅసలు ఈ వాజ్యాలకు విచారణ అర్హత ఉందా లేదా అనే అంశంపై దృష్టిసారించింది.

పిటిషనర్ కోరింది ఇదే

పిటిషనర్ కోరింది ఇదే

తాజ్‌మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల వెనుక రహస్యం కనుక్కోవాలని కోరుతూ బిజెపి అయోధ్య యూనిట్‌కి మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్న రజనీష్ సింగ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజ్ మహల్ నిజానికి పాత శివాలయం అని కొందరు చరిత్రకారులు, హిందూ సంఘాలు చేస్తున్న వాదనల్ని ఇందులో ప్రస్తావించారు. తాళం వేసి ఉన్న గదులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నివేదికను ప్రజలకు అందించాలని ఏఎస్‌ఐని పిటిషన్‌లో కోరారు.
తాజ్‌మహల్‌ను దేవాలయంగా మార్చడం కాదని, సామాజిక సామరస్యం కోసం ఈ విషయంలో నిజానిజాలను బయటకు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నామని సింగ్ అన్నారు. ఇలాంటి వివాదాలకు తెరపడాలంటే మూసి ఉన్న తలుపులను పరిశీలించడం ఒక్కటే మార్గమని అన్నారు.

పిటిషనర్ పై హైకోర్టు ఫైర్

పిటిషనర్ పై హైకోర్టు ఫైర్

తాజ్ మహల్ లో ఉన్న 20 గదుల్ని తెరవాలంటూ బీజేపీ నేత రజనీష్ సింగ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని కోరిన పిటిషనర్‌పై అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విరుచుకుపడింది. "రేపు మీరు మా ఛాంబర్‌లను చూడటానికి అనుమతి అడుగుతారు. దయచేసి ప్రజా ప్రయోజన వాజ్యాల వ్యవస్థను అపహాస్యం చేయవద్దంటూ ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. న్యాయమూర్తులు డికె ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థి పిటిషనర్‌ను అతని విజ్ఞప్తి ఏమిటని ప్రశ్నించారు. పిటిషనర్ కోర్టు రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాలని కోరుతున్నారని, కానీ హక్కుల ఉల్లంఘన విషయంలో మాత్రమే ఇది జారీ చేస్తారని కోర్టు స్పష్టత ఇచ్చింది. చరిత్ర వాస్తవాల్లోకి తాము వెళ్లడం లేదని కానీ తమ హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే మాండమస్ జారీకి కోర్టును కోరే అవకాశం ఉందని చెప్పింది.

English summary
the allahabad high court has refused to hear multiple pils seeking reopening of 20 locked rooms in tajmahal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X