'మంచాలు ఎత్తుకెళ్తేనే దొంగలు అయితే, మాల్యా సంగతేమిటి'
ఢిల్లీ: మంచాలు ఎత్తుకెళ్లిన వారిని దొంగలు అంటున్నారని, మరి రూ.9వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను ఏం అనాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మాల్యాను వెనక్కి తీసుకు రాలేకపోతున్నారని కేంద్రం పైన మండిపడ్డారు.

మొన్న ఆయన సభలోనే వేసిన మంచాలను గ్రామస్థులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఆయన స్పందించారు. మంచాలు ఎత్తుకెళ్తేనే దొంగలని అంటున్నారని, కానీ మాల్యా సంగతి ఏమిటని ఆయన పేరు పెట్టకుండా ప్రశ్నించారు. తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టి పారిపోయిన పారిశ్రామికవేత్తలను మాత్రం డీఫాల్టర్లు అంటున్నారంటూ పరోక్షంగా అన్నారు.
రెండు రోజుల క్రితం యూపీలో తొలిరోజు కిసాన్ యాత్ర సందర్భంగా దేవరియాలో జరిగిన సభలో కొత్తగా మంచాలు ఏర్పాటు చేశారు. ఆ సభ అయిపోగానే గ్రామస్థులు ఆ మంచాలను తీసుకెళ్లారు. ఆ ఘటనను గుర్తు చేస్తూ రాహుల్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు సభకు వచ్చిన వారిని ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications