వీడియో: కొత్త పార్లమెంట్‌లో మిల్కీ బ్యూటీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తెర మీదికి తీసుకొచ్చింది. దీన్ని లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో- క్రెడిట్ వార్ సాగుతోంది.
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది రాజీవ్ గాంధీ కల అని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో ప్రయత్నించామని గుర్తు చేశారు. దీని కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్నామని, ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు అమలును వాయిదా వేసిందని, అది సరికాదని చెప్పారు.

వినాయక చవితి నాటి నుంచి మనుగడలోకి వచ్చిన కొత్త పార్లమెంట్ భవన సముదాయానికి సెలెబ్రిటీల తాకిడి పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. కొత్త పార్లమెంట్ భవనంలో కనిపించారు. కొద్దిసేపటి కిందటే ఆమె పార్లమెంట్‌కు చేరుకున్నారు. రెడ్ కలర్ చీరలో మెరిసిపోయారు తమన్నా. ఆమె కారు దిగిన వెంటనే మీడియా ఫోకస్ మొత్తం అటు వైపు మళ్లింది. ప్రధాన ద్వారం, మీడియా పాయింట్‌లో ఉన్న విలేకరులు, కెమెరామెన్‌లు తమన్నాను పలకరించారు.
#WATCH | Actor Tamannaah Bhatia arrives at the Parliament in Delhi. pic.twitter.com/sDHceDI1do
— ANI (@ANI) September 21, 2023
మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించడాన్ని శుభపరిణామమని వ్యాఖ్యానించారు తమన్నా. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తోన్నారని, రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వారికి మరిన్ని అవకాశాలను కల్పించడాన్ని స్వాగతిస్తోన్నానని చెప్పారు. మహిళలు రాజకీయాల్లో సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications