ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

చెన్నై: ప్రముఖ పాపులర్ సింగ్, కోలివుడ్ సినీ గాయకుడు పళని అలియాస్ పజని కుమారుడు, యువ గాయకుడు ధరణి (34) తో సహ అతని కుటుంబ సభ్యులను వరట్నం వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నవ వధువును హింసించి అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ పెట్టిన ధరణికి అతని కుటుంబ సభ్యులు సహకరించారని, అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ధరణి వేరే వివాహిత మహిళ (ఆంటీ)తో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తండ్రి, కొడుకు ప్రముఖ సింగర్స్

తండ్రి, కొడుకు ప్రముఖ సింగర్స్

ప్రముఖ గాయకుడు, తమిళ గానా పాటల ఫేం పళని అలియాస్ పజని కుమారుడు ధరణి. ధరణి కూడా ప్రముఖ గాయకుడే. అనేక తమిళ సినిమాల్లో ధరణి పాటలు పాడాడు. ధరణి మంచి ప్లేబాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చెన్నైలోని పులియంతోప్ ప్రాంతంలో పళని, అతని కుమారుడు ధరణి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.

6 నెలల క్రితం లవ్ మ్యారేజ్

6 నెలల క్రితం లవ్ మ్యారేజ్

సింగర్ ధరణి పరిచయం ఉన్న విజయ భాను (22) అనే యువతిని ప్రేమించాడు. ధరణి, విజయ భాను పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. గత జులై నెలలో ధరణి, విజయ భాను వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి సమయంలో విజయ భాను కుటుంబ సభ్యులు ధరణికి భారీ మొత్తంలో నగదు, 20 సవర్ల బంగారు నగలు కట్నంగా ఇచ్చారు.

టార్చర్ పెట్టిన భర్త

టార్చర్ పెట్టిన భర్త

పెళ్లి జరిగిన తరువాత ధరణి తన అసలు స్వరూపం బయటపెట్టాడు. నిత్యం భార్య విజయ భానును చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. భార్య పుట్టింటి నుంచి తీసుకువచ్చిన నగలు తాకట్టుపెట్టి ఆ నగదుతో జల్సాలు చేసిన ధరణి తరువాత అదనపు కట్నం తీసుకురావాలని విజయ భానును వేధింపులకు గురి చేశాడని తెలిసింది.

మొబైల్ లో ఆంటీతో అశ్లీల ఫోటోలు

మొబైల్ లో ఆంటీతో అశ్లీల ఫోటోలు

ధరణి ఇటీవల స్నానం చేస్తున్న సమయంలో అతని మొబైల్ ఫోన్ ను విజయ భాను చూసింది. నిత్యా అనే మహిళతో ధరణి నగ్నంగా, అసభ్యంగా తీసుకున్న ఫోటోలు ఉన్న విషయం గుర్తించిన విజయ భాను షాక్ కు గురైయ్యింది. ఎవరు ఈ మహిళ?, నీ మొబైల్ లో ఎందుకు ఫోటోలు తీసుకున్నావు ? అంటూ విజయ భాను ధరణిని ప్రశ్నించింది. తరువాత ధరణి భార్య విజయ భానును శారీరకంగా మరింత హింసించాడని సమాచారం.

భార్యకు శారీరక హింస

భార్యకు శారీరక హింస

ఇటీవల విజయ భానును భర్త ధరణి శారీరకంగా హింసించాడు. శరీరం మీద ఎక్కువ గాయాలు కావడంతో విజయ భాను పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. విజయ భాను పులియంతోప్ పోలీసులకు ఫిర్యాదు చెయ్డయంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య విజయ భానును హింసించిన భర్త ధరణి, అతనికి సహకరించిన తల్లి రాజేశ్వరి, సోదరి భరణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Recommended Video

    Hero Rajasekhar Met With A Car Mishap || హీరో రాజశేఖర్‌ కారు బోల్తా! || Oneindia Telugu
    వయసులో 10 ఏళ్లు పెద్దది

    వయసులో 10 ఏళ్లు పెద్దది

    ధరణి తన కంటే 10 ఏళ్లు ఎక్కువ వయసు ఉన్న నిత్యా మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని విజయ భాను తెలుసుకుంది. నిత్యాకు ఇంతకు ముందే ఇద్దరితో పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తరువాత ధరణితో కాపురం చెయ్యడంతో మూడో బిడ్డ పుట్టాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. విజయ భానును ధరణి వేధింపులకు గురి చెయ్యడానికి అతని ప్రియురాలు నిత్యా ఏమైనా సహకరించిందా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+