Tamil Nadu Polls: తమిళ ఓటర్ సెంటిమెంట్ ఎటు ? సర్వేలు వర్సెస్ గ్రౌండ్ రియాల్టీ..!

తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి ఈ నెల 23న జరగనున్న ఎన్నికలు దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. దీనికి కారణం కేంద్రంతో సై అంటే సై అంటున్న సీఎం ఎంకే స్టాలిన్ నడుపుతున్న డీఎంకే కూటమి సర్కార్ కొనసాగింపుకు ఓటర్లు మద్దతిస్తారా లేక బీజేపీ మద్దతు ఉన్న అన్నాడీఎంకేకు అండగా నిలుస్తారా లేక విజయ్ కొత్త పార్టీ టీవీకేకు మద్దతిస్తారా అన్న సస్పెన్సే ఇందుకు కారణం. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల్లో మిశ్రమ ఫలితాలు రావడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు తమిళనాడు ఓటర్ సెంటిమెంట్, క్షేత్రస్దాయిలో పరిస్ధితి ఎలా ఉందో ఓసారి చూద్దాం.

తమిళనాడుతో తాజా ఓటర్ సెంటిమెంట్ పై జాతీయ మీడియా ఛానల్ న్యూస్ 18 సేకరించిన వివరాల ప్రకారం క్షేత్రస్దాయిలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. పోలింగ్ జరిగే లోపు చోటు చేసుకునే ప్రతీ చిన్న పరిణామం కూడా ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే), నామ్ తమిళర్ కచ్చి (ఎన్‌టీకే) వంటి కొత్త పార్టీలు తమ ఉనికిని చాటుకోవడం ప్రారంభించాయి. వారు ఓట్లను సీట్లుగా మార్చలేకపోయినప్పటికీ, హోరాహోరీగా సాగే నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Tamil Nadu 2026 Tracking the Latest Voter Mood Shifts and Street amid mixed survey reports

డీఎంకే తన సంక్షేమ నినాదంపై ప్రచారం కొనసాగిస్తుండగా.. గత కొన్నేళ్లుగా కుటుంబాలకు చేరిన పథకాల ప్రయోజనాలను ఓటర్లు గుర్తిస్తున్నారు. అయితే ప్రభుత్వంె, శాంతిభద్రతలు, పరిపాలన వేగంపై ఆందోళనలు ఉన్నాయి. ఇది ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అవకాశం కల్పిస్తోంది. దీంతో విపక్ష కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని ఓట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సంక్షేమ రాజకీయాల చర్చను మళ్లించి పాలనా సమస్యలు, అధికార దుర్వినియోగం, శాంతిభద్రతలపై అన్నాడీఎంకే కూటమి ఫోకస్ చేస్తోంది.

Tamil Nadu 2026 Tracking the Latest Voter Mood Shifts and Street amid mixed survey reports

రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారని అంచనా. హోరాహోరీ పోరులో, వారి ఓటింగ్ సరళి నిర్ణయాత్మకంగా మారొచ్చు. యువకులు, తొలిసారి ఓటర్లు కూడా కీలకంగా ఉన్నారు. వీరు కొత్త పార్టీలతో సహా ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే చెన్నై వంటి పట్టణ కేంద్రాలలో డీఎంకే ఆధిక్యం కొనసాగుతోంది. పశ్చిమ ప్రాంతంలో హోరాహోరీ పోటీ ఉంది. ఇక్కడ అన్నాడీఎంకే తన సంప్రదాయ బలాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. డెల్టా, దక్షిణ జిల్లాలలో పరిస్ధితి అనిశ్చితంగా ఉంది. దీంతో తమిళనాడు ఫలితాలు ఈసారి స్వల్ప ఆధిక్యాలపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+