తమిళనాడు బస్సులో రూ. 1.34 కోట్లు సీజ్
కోయంబత్తూరు: తమిళనాడులో శాసన సభ ఎన్నికల సందర్బంగా ఓటర్లకు పంచిపెట్టడానికి తీసుకు వెలుతున్న డబ్బును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ తేది సమీపిస్తుండటంతో రానురాను ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో అధికారులు అక్కడక్కడ నిఘా వేశారు.
మే 16వ తేదిన తమిళనాడులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. పలు చోట్ల పలు పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. పోటీ చేస్తున్న అభ్యర్థుల వాహనాలు, వారి కాన్వాయ్ లను అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
అయితే కొందరు నగదును ప్రయివేటు వాహనాలు, బస్సులు, లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. గురువారం కోయంబత్తూరు నుంచి కేరళ వెలుతున్న బస్సులో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. బస్సులో అక్షరాల రూ. ఒక కోటి 34 లక్షలు బయటపడింది.

ఇదే సందర్బంలో నగదు తరలించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇద్దరిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. నగదు ఎవరిది అంటూ ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే ఇద్దరి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. నగదు తరలిస్తున్నారని కచ్చితమైన సమాచారం రావడంతోనే బస్సులో సోదాలు చేశామని ఓ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications