Tamil Nadu Assembly Election 2021: నామినేష‌న్ దాఖలు చేసిన బీజేపీ నేత, నటి ఖుష్బూ సుంద‌ర్

తమిళనాడులో హోరాహోరీగా ఎన్నికల పోరు కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. తమిళనాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

తమిళనాడు రాష్ట్రంలో మొదటినుంచి రాజకీయ పార్టీల ఇది ఒక విభిన్నమైన శైలి. ఉచిత పథకాలతో దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది తమిళనాడు రాష్ట్రం. ఇక తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నారు.

 Tamil Nadu assembly polls .. Khushbu Sundar filed nomination

ప్రధాన పార్టీలు డిఎంకె, ఏ ఐ ఏడి ఎం కె విడుదల చేసిన మ్యానిఫెస్టోలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కోయంబత్తూరు సౌత్ నుండి మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయగా, తాజాగా తమిళనాడు బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు.
థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

నామినేషన్ వేయడానికి ముందు ఇవాళ ఖుష్బూ సుందర్ వల్లువరుకోట్టంలో రోడ్ షో నిర్వహించారు.

మొత్తానికి సినీ ప్రముఖులు, అగ్ర తారలు, హేమాహేమీలైన రాజకీయ దిగ్గజాలు తమిళనాట తమ జెండా ఎగురవేయాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. మరి తమిళ ఓటర్లు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

పోటీ చేయబోయే 20 నియోజకవర్గాల్లో 17 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తరువాత, బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఆర్ జయసీలన్ (విలావన్‌కోడ్ నియోజకవర్గం), భోజరాజన్ (ఉధాగండలం), థల్లి అభ్యర్థిగా డిసి నాగేష్ కుమార్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+