అయ్యో వెంకయ్యా: ఇది తమిళనాయుడు ఎలా?
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడి జపం చేస్తూ చేస్తూ ఓ రాష్ట్రం పేరుకు నాయుడు అని తగిలించి చిక్కుల్లో పడ్డారు.
దక్షిణాదిలోని తమిళనాడు రాష్ట్రం పేరును తమిళనాయుడు అంటూ పట్టణాభివృద్ది శాఖ అధికారులు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో రెండు చోట్ల తమిళనాయుడు అని పేర్కోనడంతో తమిళ ప్రజలు మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫ్ర్ ర్మేషన్ (అమృత్) ప్రాజెక్టు కింద తమిళనాడు ప్రభుత్వానికి రూ. 3,249 కోట్లు సిఫారస్సు చేస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఓ నోట్ జారీ చేశారు.

అందులో అధికారులు తమిళనాడుకు బదులు తమిళనాయుడు అంటూ రెండు సార్లు టైప్ చేసి పెట్టారు. ఒక్కసారైనా ఆ ప్రెస్ నోట్ పరిశీలించకుండా దానిని మీడియాకు విడుదల చేసి చిక్కుల్లో పడ్డారు.
బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే తమిళనాడుకు బదులు తమిళనాయుడు అని ఉండటంతో వెంకయ్యనాయుడు అధికారులకు క్లాస్ ఇచ్చారు. ఇక మీద ఇలాంటి పోరపాట్లు జరిగితే సహించేది లేదని హెచ్చరించారని తెలిసింది.












Click it and Unblock the Notifications