జయ మృతి, అదే గౌరవం: సీఎం కుర్చి వద్దు, పన్నీర్ సెల్వం
చెన్నై: ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వం తన పాత గదిలోనే కుర్చుని అన్ని పనులను పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మృతితో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సీఎంగా పన్నీర్ సెల్వంను ఎన్నుకున్నారు.
డిసెంబర్ 6వ తేదీన రాజ్ భవన్ లో సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి వర్గ సమావేశం నిర్వహించడానికి శనివారం ఉదయం 11.30 గంటలకు మొదటి సారి ఆయన సచివాలయంలోకి వెళ్లారు.

అయితే సమావేశం పూర్తి అయిన తరువాత పన్నీర్ సెల్వం నేరుగా తన గదిలోకి వెళ్లారే తప్ప సీఎం చాంబర్ వైపు కన్నెత్తికూడా చూడలేదు. పార్టీలోని కొందరు మంత్రులు జయలలిత కుర్చుకున్న గదిలోకి వెళ్లాలని, అమ్మ కుర్చున్న కుర్చీలో కుర్చుని పనులు పర్యవేక్షించాలని సూచించారు.
అందుకు సీఎం పన్నీర్ సెల్వం సున్నితంగా తిరస్కరించారు. జయలలిత తనకు అమ్మ, గురువు, దైవం, అలాంటిది ఆమె కుర్చున్న కుర్చిలో ఎలా కుర్చుంటాను ? అని మంత్రులను ప్రశ్రించారు. జయలలిత మరణించినా ఆమె మీద ఉన్న గౌరవం బతికే ఉందని సీఎం పన్నీర్ సెల్వం నిరూపించుకున్నారు.

జయలలిత సీఎంగా ఉన్న సమయంలో కుర్చున్న గదిని శుభ్రం చేయించారు. అమ్మ వస్తువులు అన్నీ పోయెస్ గార్డెన్ కు పంపించారు. జయలలిత ఉన్న గదికి తాళం వేయించారు. ఆర్థిక మంత్రిగా అమ్మ తనకు కేటాయించిన గదినే సీఎం చాంబర్ గా చేసుకుని పన్నీర్ సెల్వం పనులు పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications